Sukumar Daughter Film: మొన్న మహేష్ బాబు.. ఇప్పుడు రామ్ చరణ్!
ABN, Publish Date - Jan 25 , 2025 | 03:57 PM
ఇటీవల రిలీజైన రెండు సినిమాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు రివ్యూలు ఇచ్చారు. అందులో ఒకటి వెంకీమామ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అయితే రెండోది సుకుమార్ కుమార్తె నటించిన ‘గాంధీ తాత చెట్టు’. ఇప్పుడు మహేష్ బాబు బాటలోనే రామ్ చరణ్, ఉపాసన కూడా నడుస్తున్నారు. వారిద్దరూ ఏం చేశారంటే..
‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో టాలీవుడ్ రేంజ్‌ని పెంచిన దర్శకుడు సుకుమార్. క్రియేటివ్ డైరెక్టర్‌గా సినిమా సినిమాకు తన ప్రతిభను చాటుకున్న సుకుమార్.. ‘పుష్ప 2’ తర్వాత సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో చేయబోతున్నారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలతో సుకుమార్ ఎన్నో ప్రశంసలు అందుకోగా.. తాజాగా ఆయన కుమార్తె సుకృతి వేణి కూడా అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఎందుకని అనుకుంటున్నారా? ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Akhanda 2 Thandavam Heroine: ప్రగ్యా జైస్వాల్ ఏమైంది.. ఇదేం ట్విస్ట్ బోయపాటి?
దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’ (Gandhi Tatha Chettu). పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పించారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకోవడంతో పాటు.. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం అందుకున్నారు. జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ మరియు ఉపాసన కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
Also Read- Gandhi Tatha Chettu Review: సుకుమార్ కుమార్తె నటించిన సినిమా ఎలా ఉందంటే
సుకృతి వేణి నటనకు వస్తున్న రెస్పాన్స్ పట్ల రామ్‌చరణ్, ఉపాసనలు అభినందనలు తెలియజేశారు. ‘గాంధీ తాత చెట్టు’ టీమ్‌తో వారిద్దరూ కాసేపు ముచ్చటించారు. రామ్‌చరణ్, ఉపాసనలను కలిసిన వారిలో చిత్ర సమర్పకురాలు తబితా సుకుమార్, దర్శకురాలు పద్మ, నిర్మాత సింధు, రాగ్‌మయూర్, భాను ప్రకాష్, నేహాల్ తదితరులు ఉన్నారు. సెలబ్రిటీలనే కాదు.. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకుల నుండి కూడా ఈ సినిమా మంచి ప్రశంసలు దక్కించుకుంటుంది. సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటోంది. మంచి సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించిన సుకృతి వేణి నటనకు అంతా ఫిదా అయిపోతున్నారు. 13 ఏళ్ల అమ్మాయిగా గాంధీ పాత్రలో ఆమె సహజ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.