NTR: ఎన్టీఆర్ 'డ్రాగన్' అంచనాలు మీ ఇష్టం..
ABN, Publish Date - Mar 03 , 2025 | 03:28 PM
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి 'డ్రాగన్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో 3000 మంది ఆర్టిస్ట్‌లతో షూటింగ్ మొదలుపెట్టారు.
ఎన్టీఆర్(NTR), ప్రశాంత్ నీల్ (Prashanth neel) కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి 'డ్రాగన్' (Dragon) అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో 3000 మంది ఆర్టిస్ట్‌లతో షూటింగ్ మొదలుపెట్టారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన యలమంచిలి రవి శంకర్ (Y Ravishankar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు ఈ చిత్రం కోసం యునీక్ స్క్రిప్ట్ రెడీ చేశారని రవి చెప్పారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుంది అనడానికి స్కై ఈజ్ ద లిమిట్ అని చెప్పి సినిమాపై అంచనాలు పెంచేశారు.
"ఇంటర్‌నేషనల్ స్థాయి కథ ఇది. మీరు ఎంత్తైనా ఊహించుకోండి. ఎన్ని అంచనాలైనా పెట్టుకోవచ్చు. అనుకున్న సమాయానికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని రవి శంకర్ అన్నారు. ప్రశాంత్ నీల్ తారక్ కాంబో అనగానే సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు రవి శంకర్ చేసిన వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు రెట్టింపు చేశారు. ఇందులో తారక్ సరసన రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించనుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.