RIP KP Chowdary: కేపీ చౌదరి మరణం.. సుప్రీత పోస్ట్ వైరల్
ABN, Publish Date - Feb 03 , 2025 | 03:03 PM
రజనీకాంత్ నటించిన కబాలి చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన నిర్మాత కేపీ చౌదరి కన్నుమూశారు. సోమవారం గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య కారణాలతో అయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
రజనీకాంత్ (Rajinikanth) నటించిన 'కబాలి' (Kabali) చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన నిర్మాత కేపీ చౌదరి కన్నుమూశారు. సోమవారం గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య కారణాలతో అయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో డ్రగ్స్ కేసులో కేపీ చౌదరిని (Kp Chowdary is nomore) నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. వరలక్ష్మి టిఫిన్ డ్రగ్స్ కేసులో నిందితుడుగా కేపీ చౌదరి ఉన్నారు. చాలామంది సినీ సెలబ్రిటీలకు డ్రగ్స్ (KP Chowdary Drugs Case) అందజేసినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు .
అయితే, డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరిని గతంలో రాజేంద్రనగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గోవా నుంచి మాదక ద్రవ్యాలను తరలిస్తూ పోలీసులకు చౌదరి పట్టుపడ్డారు. గోవా నుంచి 100 ప్యాకెట్ల కొకైన్ తీసుకు రాగా.. 90 ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 10 ప్యాకెట్లు ఎవరికి అమ్మారన్న విషయంపై పోలీసుల దర్యాప్తు చేశారు. సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్‌తో సినీ డ్రగ్స్ లింక్స్ తెర మీదకు వచ్చాయి.
సురేఖ వాణి (Surekha vani) కూతురు సుప్రీత (Supreeta) సోషల్ మీడియా వేదికగాఒక పోస్ట్ పెట్టి అయన మరణించినట్లు తెలిపారు. కేపీ చౌదరితో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి "సొసైటీ ఇక్కడే ఫెయిల్ అయింది, నిన్ను ఎప్పటికీ మిస్ అవుతున్నాను, అన్న నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? నీ బాధలు నేను వినడానికి లేకుండా చేసావు కదా అన్న.. నీకు ఈ చెల్లి ఎప్పుడూ ఉంటుందన్నా, దయచేసి వెనక్కి వచ్చేయ్!@ మిస్ యు కెపి అన్న. నువ్వు ఎక్కడున్నా టైగర్ ఏ అంటావుగా, ఐ లవ్ యు సో మచ్ అన్న. రెస్ట్ ఇన్ పీస్ అంటూ సుప్రీత భావోద్వేగానికి గురయ్యారు.