Prabhas look: ప్రళయ కాల రుద్రుడు.. త్రికాల మార్గదర్శకుడు

ABN, Publish Date - Feb 03 , 2025 | 11:52 AM

కన్నప్పలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆయన ఏ పాత్ర పోషిస్తున్నారనే ఆసక్తిక ప్రేక్షకుల్లో ఉంది. సోమవారం చిత్ర బృందం ఆయన క్యారెక్టర్‌ను రివీల్‌ చేశారు.

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప' (Kannappa) ఏప్రిల్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ షురూ అయ్యాయి. ఈ చిత్రంలో భారతీయ చిత్ర పరిశ్రమల్లో పేరొందిన ఎందరో నటీనటులు భాగమాయ్యరు. ఇందులో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆయన ఏ పాత్ర పోషిస్తున్నారనే ఆసక్తిక ప్రేక్షకుల్లో ఉంది. సోమవారం చిత్ర బృందం ఆయన క్యారెక్టర్‌ను రివీల్‌ చేశారు. ఇందులో రుద్ర (Prabhas As Rudra) పాత్రలో ప్రభాస్‌ కనిపించనున్నారని కొత్త పోస్టర్‌ ద్వారా చిత్ర బృందం తెలిపింది.  

"ప్రళయ కాల రుద్రుడు.. త్రికాల మార్గదర్శకుడు..  శివాజ్ఞ పరిపాలకుడు ’’ అని టీమ్‌ పేర్కొంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ ఎలాంటి పాత్ర చేయబోతున్నారనే ప్రశ్నలకు చిత్ర బృందం చెక్‌ పెట్టింది.


అవా ఎంటర్టైన్మెంట్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌బాబు, శరత్‌కుమార్‌, మధుబాల, ముఖేష్‌రిషి, బ్రహ్మానందం బ్రహ్మాజీ, మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌, కాజల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 25 గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు, టీజర్‌ అందరినీ ఆకట్టుకున్నాయి.     

Updated Date - Feb 03 , 2025 | 11:52 AM