Jr NTR: ఎన్టీఆర్ స్టైలిష్ షర్ట్.. దీని ధరతో ఓ స్కూటీ కొనేయొచ్చు
ABN, Publish Date - Apr 16 , 2025 | 03:45 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వేసుకున్న షర్ట్ ధర హాట్ టాపిక్ గా మారింది. చూసేందుకు సింపుల్ గా కనిపిస్తున్న ధర మాత్రం షాక్ అయ్యేలా చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు వామ్మో అనేస్తున్నారు.
సినిమా స్టార్స్ కి ఫ్యాన్స్ కంటే భక్తులు ఎక్కువగా ఉంటారు. రిల్ లైఫ్ లోనైనా రియల్ లైఫ్ లో నైనా స్టార్స్ ఏ పని చేస్తే ఫ్యాన్స్ అలాగే ఫాలో అవుతుంటారు. మరీ ముఖ్యంగా హీరోల డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, మేకోవర్ ను బాగా ఫాలో అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు. హీరోల ప్రతి అప్ డేట్ ను తెలుసుకునేందుకు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తుంటారు. కాళ్లకు వేసుకునే షూస్ నుంచి తినే ఫుడ్ వరకు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటిదే ఎన్టీఆర్ ( NTR)కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
నేను ట్రెండ్ ఫాలో కాను సెట్ చేస్తా అనేది పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )డైలాగ్ అయినప్పటికీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలా ట్రెండ్‌ని ఎప్పటికప్పుడు సెట్ చేస్తూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే.. ఫ్యాషన్ విషయంలో అందరి హీరోల కంటే ట్రెండీగా ఉంటారు. ప్రత్యేకంగా ఆయన లగ్జరీ లైఫ్ , ఖరీదైన కార్లు , డ్రెస్సింగ్ విషయంలో ట్రెండ్ సెట్టర్‌గానే నిలుస్తూ ఉంటారు. అలా మరోసారి తన లగ్జరీని బయటపెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్.... ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్ కు వెళ్లాడు. ఓ వైపు ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చిల్ అవుతునే మరోవైపు సరదాగా ఫ్యాన్స్ ను కలిశాడు. అయితే అప్పుడు ఎన్టీఆర్ వేసుకున్న షర్ట్ ధర హాట్ టాపిక్ అయింది. సింపుల్ గా కనిపించిన డిజైనర్ బ్రాండ్ కు చెందిన ఆ షర్ట్ ధర అక్షరాల .85 వేలు అని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఎన్టీఆర్ షర్ట్ ప్రైజ్ పై నెటిజన్స్ స్పెషల్ డిస్కషన్స్ పెట్టేశారు. ఇటీవల కాలంలో తారక్ స్టైల్ కు ఐకాన్ గా మారాడని కొందరు కామెంట్ చేస్తే... ఒక్క చొక్కాకి అంత డబ్బులు ఖర్చు పెట్టాడా? అని ఇంకొందరు కామెంట్ చేశారు. ఇకయంగ్ టైగర్ సినిమాల విషయానికి వస్తే... వార్2 తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. టాలీవుడ్ లో ప్రశాంత్ నీత్ తో మూవీ చేస్తున్నాడు. ఈ నెల 22 నుంచి జరిగే షెడ్యూల్ లో తారక్ జాయిన్ కానున్నాడు. ఇవే కాక క్రేజీ లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.