NTR 31: తారక్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. నీల్‌ మొదలెట్టాడు

ABN, Publish Date - Feb 20 , 2025 | 04:12 PM

ఎన్టీఆర్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గతేడాది పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది. అయితే ఇప్పటిదాకా సెట్స్‌ మీదకు వెళ్లలేదు.


ఎన్టీఆర్‌(NTR), దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గతేడాది పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది. అయితే ఇప్పటిదాకా సెట్స్‌ మీదకు వెళ్లలేదు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌ మొదలు కాబోతుందని, ఎన్టీఆర్‌ (NTR shoot లేని సన్నివేశాలు చిత్రీకరిస్తారని, వచ్చే నెల మొదటివారంలో ఎన్టీఆర్‌ సెట్‌లో అడుగుపెటతారని వార్తలొచ్చాయి. తాజాగా ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ మొదలైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది. (NTR31)



‘‘భారతీయ సినిమా చరిత్రలో ఒక మార్క్‌ని క్రియేట్‌ చేసేలా  ఈ మట్టి ఎట్టకేలకు తన  పాలనను స్వాగతించింది. ఎన్టీఆర్‌ - నీల్‌ సినిమా అధికారికంగా మొదలైంది. ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త యాక్షన్‌, వినోదం సిద్థమవుతోంది’’ అని టీమ్‌ పేర్కొంది. చిత్రీకరణకు సంబంధించిన ఫొటోలు సైతం పంచుకుంది. ఫొటోలో ప్రశాంత్‌ నీల్‌ యాక్షన్‌ సన్నివేశాన్ని డైరెక్ట్‌ చేస్తూ కనిపించారు. ఎన్టీఆర్‌ ఇంకా ఈ చిత్రీకరణలో భాగం కాలేదని తెలుస్తోంది.   తారక్‌ హీరోగా నటిస్తున్న 31వ చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా  నిర్మిస్తున్నాయి. పీరియాడిక్‌ మాస్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందనుంది. రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా సందడి చేయనుంది. టొవినో థామస్‌ కీలక పాతలో కనిపించనున్నారు.  వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.  

Updated Date - Feb 20 , 2025 | 04:21 PM