NTR -Neel: ఆ రోజున థియేటర్లు దద్దరిల్లడం చూస్తారు..
ABN, Publish Date - Apr 29 , 2025 | 03:48 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మేకర్స్ తారక్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డ్రాగన్ (Dragon Release date) వర్కింగ్ టైటిత్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ తారక్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు. మే 20న తారక్ బర్త్‌డే కానుకగా అవైటెడ్ గ్లింప్స్‌ని రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. సినిమాను 2026, జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని చెబుతు మైత్రీ నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
"ఇద్దరు డైనమిక్ వ్యక్తుల కాంబోలో బాక్సాఫీస్ విధ్వంసం అయ్యే సమయానికి సిద్ధంకండి. 25 జూన్ 2026న థియేటర్లు దద్దరిల్లే సౌండ్స్ మీరు వింటారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ పుట్టినరోజున స్పెషల్ గ్లింప్స్ విడుదల చేస్తాం’’ అని పేర్కొన్నారు.
అయితే తొలుత ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర బృందం ప్రకటించింది. కథ స్పాన్ దృష్ట్యా చిత్రీకరణకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు సైతం ఆలస్యమయ్యేలా ఉండటంతో కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ‘కేజీయఫ్’, ‘సలార్’ సినిమాలకు దీటుగా ఈ సినిమా ఉండాలని, టేకింగ్ - మేకింగ్ విషయంలో రాజీపడకూడదని ప్రశాంత్‌నీల్ భావిస్తున్నారు.