Sandhya Theater: అల్లు అర్జున్ బెయిల్‌పై కాసేపట్లో తీర్పు
ABN, Publish Date - Jan 03 , 2025 | 10:03 AM
అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్ (Regular Bail) పిటిషన్‌పై నాంపల్లి కోర్టు మరి కాసేపట్లో తీర్పు వెలువరించనుంది.
అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్ (Regular Bail) పిటిషన్‌పై నాంపల్లి కోర్టు మరి కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఇరువైపుల వాదనలు ముగియగా.. న్యాయస్థానం తీర్పును శుక్రవారానికి వాయిదా పడింది.
‘పుష్ప2’ (Pushpa 2) బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో ఆయన వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.