Nagarjuna: చైతూ నటనపై నాగ్ స్పందన ఇదే..
ABN, Publish Date - Feb 09 , 2025 | 10:04 PM
నాగ చైతన్య నటనపై అనేక విమర్శలు ఉన్నాయి. దీనిని నాగ చైతన్య కూడా అంగీకరించాడు. మరి దీనిపై నాగార్జున ఎలా స్పందించాడో తెలుసా!
నాగ చైతన్య నటనపై అనేక విమర్శలు ఉన్నాయి. దీనిని నాగ చైతన్య కూడా అంగీకరించాడు. యాక్టింగ్ అనేది ఒక లెర్నింగ్ ప్రాసెస్.. ఇంప్రూ అవుతోంది అని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆయన 'తండేల్' సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కేవలం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడం మాత్రమే కాకుండా.. చైతన్య పర్ఫామెన్స్ కు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే చైతన్య తండ్రి, నటుడు నాగార్జున ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు.
తండేల్ సక్సెస్ కావడంతో నాగార్జున పోస్టు చేస్తూ.. ‘‘డియర్ చైతన్య.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ సినిమా కోసం నువ్వు సవాళ్లు ఎదుర్కోవడం, నటుడిగా పరిధులు దాటడం చూశా. ‘తండేల్’.. సినిమా మాత్రమే కాదు నీ ప్యాషన్, కష్టానికి నిదర్శనం. అక్కినేని అభిమానుల్లారా.. మీరంతా కుటుంబ సభ్యుల్లాగా ఎప్పుడూ మా వెన్నంటే ఉన్నారు. మీ ప్రేమ, సపోర్ట్‌కు ధన్యవాదాలు. సాయి పల్లవి కంగ్రాట్స్. దేవిశ్రీ ప్రసాద్.. నువ్వు రాకింగ్. రైజింగ్ స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి, తండేల్ టీమ్‌కు, నిర్మాతలు అల్లు అరవింద్ గారు, బన్నీ వాసుకు బిగ్ థాంక్స్’’ అని రాసుకొచ్చారు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) మత్య్సకారులు కుటుంబానికి చెందిన వారు. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ప్రాణం. సముద్రంలో చేపలు పట్టడం రాజు జీవనాధారం. తొమ్మిది నెలలు సముద్రంలో ఉంటే, మూడు నెలలు ఊర్లో ఉంటాడు. ఆ తొమ్మిది నెలలు రాజు, సత్య ఒకరికోసం ఒకరు విరహవేదనతో రగిలిపోతుంటారు. ఫోన్‌లో మాట్లాడే ఒక్క రోజు కోసం నెలంతా ఎదురు చూస్తుంటారు. ఈ దూరం భరించలేని సత్య, వేటకు వెళ్తే ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో అనే భయంతో ఇక ముందు వేటకు వెళ్లవద్దని, ఊళ్లోనే ఉండి ఏదైనా పని చూసుకోమని చెబుతుంది. అలాగే అని మాటిచ్చిన రాజు, మళ్లీ సముద్రంలోకి వేటకు వెళ్లిపోతాడు. దాంతో రాజుపై అలకతో అతనికి దూరమవుతుంది. ఇద్దరి మధ్య మాట మంచి ఏమీ ఉండదు. సముద్రంలో వేటకు వెళ్లిన రాజు.. అతని బృందం22 మంది ప్రయాణించే బోటు తుఫాను తాకిడికి పొరపాటున పాకిస్థాన్ బోర్డర్‌లోకి ప్రవేశిస్తుంది. దాంతో అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. పాకిస్థానీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. దాంతో సత్య, రాజుల మధ్య దూరం మరింత పెరుగుతుంది. మళ్లీ వారిద్దరూ ఎలా కలిశారు? పాకిస్థాన్ చెర నుంచి ఎలా భయపడ్డారు అనేది కథ.