Naga Chaitanya Sobhita Dhulipala Wedding: ఓటీటీలో నాగ చైతన్య, శోభితలాల పెళ్లి
ABN, Publish Date - Feb 03 , 2025 | 06:52 PM
Naga Chaitanya Sobhita Dhulipala Wedding: తాజాగా మరో జంట తమ పెళ్లిని ఓటీటీలో స్ట్రీమ్ చేసేందుకు రెడీ కానున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విగ్నేష్ ల పెళ్లి డాక్యుమెంటరీని దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ టెలికాస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ ఎన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రొడక్షన్, రైట్స్ సంగతి పక్కనా పెడితే.. పెళ్లి క్యాసెట్ లను ఓటీటీకి అమ్ముకోవడం ఏంటని విమర్శలు చేశారు. ఇది ఇలా ఉండగా తాజాగా మరో స్టార్ కపుల్స్ తమ పెళ్లి వీడియోని ఓటీటీలో టెలికాస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
గతేడాది హీరో నాగ చైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహించిన ఈ పెళ్ళికి లిమిటెడ్ గెస్టులు హాజరయ్యారు. అయితే ఈ పెళ్లి ఫుటేజ్ ని ఓ ప్రముఖ ఓటీటీ ఛానెల్ లో స్ట్రీమ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారట. ఆ ఓటీటీ సంస్థ ఎదో కాదు, నెట్‌ఫ్లిక్సే. ఇప్పటికే సామ్ తో విడాకులు, రెండో పెళ్లి అని కొందరు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తుండగా.. ఈ వార్త మరింతా అగ్గి రాజేస్తుంది.
మరోవైపు ఆదివారం హైదరాబాద్ లో నాగ చైతన్య లేటెస్ట్ ఫిల్మ్.. 'తండేల్' సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిరాడంబరంగా జరిగింది. అభిమానులు, ప్రేక్షకులు లేకుండానే కేవలం సినిమా యూనిట్ నడుమ జరిగింది. ఈ కార్యక్రమానికి బన్నీ అతిథిగా రావాల్సి ఉంది అయితే ఆయన విదేశాల నుంచి రావడం, కాస్త ఆరోగ్యం బాగోకపోవడంతో ఆయన రాలేకపోయారు. సందీప్ రెడ్డి వంగా అతిథిగా హాజరు అయ్యారు. ఈ వేడుకలో అల్లు అరవింద్, నాగచైతన్య, సాయిపల్లవి సందడి చేశారు. ఇటీవల విడుదలై హిట్టైన హైలెస్సో సాంగ్ స్టెప్పులేసి ఆహుతులను ఉర్రూతలూగించారు.