Adivi Sesh: మేన్షన్ హౌస్ మల్లేష్ మొదలెట్టేశాడు...
ABN, Publish Date - Feb 22 , 2025 | 03:57 PM
శ్రీనాథ్ మాగంటి హీరోగా నటించిన 'మేన్షన్ హౌస్ మల్లేష్' మూవీ ఫస్ట్ సింగిల్ ను ప్రముఖ కథానాయకుడు అడివి శేష్ విడుదల చేశారు.
శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'మేన్షన్ హౌస్ మల్లేష్'. బాల సతీశ్ దర్శకత్వంలో రాజేశ్ ఈ సినిమాను నిర్మించారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. 'బంగారి బంగారి' అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, హరిణి ఇవటూరి పాడారు. ఈ సాంగ్ లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బ్యూటిఫుల్ గా ఉంటుందని మేకర్స్ చెప్పారు. ఈ లిరికల్ వీడియోను హీరో అడివి శేష్ రిలీజ్ చేసి టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అతి త్వరలోనే ఈ మూవీ జనం ముందుకు రానుంది.