Dear Krishna: ప్రేమలు బ్యూటీ మరో సినిమా
ABN, Publish Date - Jan 16 , 2025 | 10:08 AM
ప్రేమలు (Premalu) చిత్రంతో చక్కని గుర్తింపు తెచ్చుకుంది మమితా బైజు 9Mamitha Baiju) . తాజాగా ఆమె మరో చిత్రంలో నటిస్తున్నారు.
ప్రేమలు (Premalu) చిత్రంతో చక్కని గుర్తింపు తెచ్చుకుంది మమితా బైజు 9Mamitha Baiju) . తాజాగా ఆమె మరో చిత్రంలో నటిస్తున్నారు. అక్షయ్, మమితా బైజు, ఐశ్వర్య నాయకానాయికలుగా దినేశ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘డియర్ కృష్ణ’ (Dear Krishna) పీఎన్ బాలరామ్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ట్రైలర్‌ను రచయిత విజయేంద్ర ప్రసాద్, నటుడు శ్రీకాంత్ ఇటీవల విడుదల చేశారు.
‘‘శ్రీకృష్ణుడికి.. ఆయన భక్తుడికి మధ్య జరిగిన ఓ అద్భుత సంఘటనను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇది కచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ చిత్ర మొదటి వంద టికెట్ల బుకింగ్‌లో నుంచి ఒక టికెట్‌ను ఎంపిక చేసి.. దాన్ని కొన్న వ్యక్తికి రూ.10వేలు ఇస్తాం’’ అని చిత్ర బృందం తెలిపింది.