SSMB 29: రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నావ్ సామి.. ఆందోళనలో మహేష్ ఫ్యాన్స్
ABN, Publish Date - Feb 05 , 2025 | 10:19 AM
'వెంటనే మహేష్ డేట్లు ఇస్తాడా? వెకేషన్ పరిస్థితి ఏంటి? ప్రభాస్ తన 5 ఏళ్ల పీక్ కెరీర్‌ని రాజమౌళికి సమర్పించుకున్నట్లు మహేష్ సమర్పించుకుంటాడా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.' ఇంతకు ఏం జరిగిందంటే..
దర్శకధీరుడు రాజమౌళి.. మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'SSMB 29'. ఇప్పటికే ఈ సినిమాపై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రంలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే మలయాళ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ ఇందులో నటిస్తున్నాడా లేదా అనేది ఇంకో చర్చ మారింది. ప్రియాంక చోప్రాతో పాటు మరో హాలీవుడ్ బ్యూటీని కూడా సినిమా కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగానే తెరపైకి మరో అంశం వచ్చింది.
రాజమౌళి, మహేష్ ల ప్రాజెక్ట్ 2027 లేదా 2028లో థియేటర్ లలో వచ్చే అవకాశముంది. అడవుల్లో సాగే సాహస ప్రపంచ యాత్ర నేపథ్యంలో ఈ కథను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ కథను పూర్తిగా ఒకే పార్టులో రాజమౌళి చూపించగలడా అనే కొత్త చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఈ కథను మూడు భాగాలుగా రాజమౌళి తీర్చిదిద్దనున్నాడని పలు కథనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే మొదటి భాగం పూర్తి కాగానే రెండవ భాగం షూట్ చేస్తారా అనేది కొత్త ప్రశ్నగా మారింది. వెంటనే మహేష్ డేట్లు ఇస్తాడా? వెకేషన్ పరిస్థితి ఏంటి? ప్రభాస్ తన 5 ఏళ్ల పీక్ కెరీర్ ని రాజమౌళి కి సమర్పించుకున్నట్లు మహేష్ సమర్పించుకుంటాడా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతో నిజం ఉందొ తెలీదు కాని రాజమౌళి విజన్ ని సంశయించలేము. దీంతో మహేష్ అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఇదిలా ఉండగా రాజమౌళి 'SSMB 29' కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులతో చిత్రబృందం నాన్-డిస్‌క్లోజ్ అగ్రిమెంట్ (NDA) చేయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో ఎలాంటి లీకులు కాకుండా చిత్ర బృందం భారీగా ప్లాన్ చేసింది. ఈ సినిమాని దుర్గ బ్యానర్ పై KL నారాయణ నిర్మిస్తున్నారు.