Gopichand: మళ్ళీ రిపీట్ అవుతున్న 'సీటీమార్' కాంబో
ABN, Publish Date - Mar 10 , 2025 | 04:17 PM
గతంలో గోపీచంద్ తో 'సీటీమార్' చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాస చిట్టూరి, ఇప్పుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ కొత్త సినిమాను ప్రారంభించారు.
ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి (Srinivasa Chitturi) మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సమంత (Samantha) తో 'యూ టర్న్' (U Turn) మూవీని తెలుగులో పునర్ నిర్మించిన ఆయన ఆ తర్వాత 'సీటీమార్, వారియర్, కస్టడీ, స్కంద, నా సామిరంగ' వంటి చిత్రాలను నిర్మించారు. ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) నాయికగా ఆయన నిర్మించిన 'బ్లాక్ రోజ్' విడుదల కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే... తన 'సీటీమార్' కథానాయకుడు గోపీచంద్ తోనే శ్రీనివాస చిట్టూరి ఇప్పుడీ సినిమా తీస్తున్నారు. దీనికి పవన్ కుమార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు 'ఘాజీ' (Ghazi) తో జాతీయ స్థాయిలో గుర్తింపును, అవార్డును పొందిన సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) దర్శకత్వం వహిస్తున్నారు. 'ఘాజీ' ఘన విజయం తర్వాత సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన 'అంతరిక్షం' (Antariksham 9000 KMPH), హిందీ సినిమా 'ఐబి 71' (IB 71) ఆశించిన స్థాయిలో ఆడలేదు.
Also Read: Pawan Kalyan: చిరంజీవి మూవీ ప్లేస్ లో పవన్ సినిమా
Also Read: Old Love Birds: 18 యేళ్ళ తర్వాత...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి