Manchu Vishnu: యోగి ఆవిష్కరించిన కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్

ABN, Publish Date - Apr 09 , 2025 | 02:33 PM

'కన్నప్ప' సినిమా విడుదల తేదీ పోస్టర్ ను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఆవిష్కరించారు. జూన్ 27న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది.

సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు (Mohanbabu) నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'కన్నప్ప' (Kannappa). ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ సినిమాను విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాని కారణంగా వాయిదా వేశారు. అయితే... తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ (Yogi Adityanath) చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. మంచు మోహన్ బాబుతో పాటుగా 'కన్నప్ప' చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేసిన మంచు విష్ణు (Manchu Vishnu), ఈ చిత్రానికి కొరియోగ్రఫీ అందించిన ప్రభుదేవా (Prabhudeva) కూడా ఈ పోస్టర్ లాంచ్ కు హాజరయ్యారు. రిలీజ్ డేట్ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం యోగి ఆదిత్యనాధ్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదల చేయబోతున్నారు.


ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు మంచి స్పందన లభించింది. గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో రాలేదని గత యేడాది చివరిలో రావాల్సిన సినిమాను ఏప్రిల్ కు వాయిదా వేశారు. ఈ మధ్య కాలంలో ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. దానిని దృష్టిలో పెట్టుకుని మరింత మెరుగైన విఎఫ్ఎక్స్ ఇవ్వాలనే ఆలోచనతో మరికొంత సమయాన్ని మంచు విష్ణు తీసుకున్నారు. ఇప్పుడు ఇక జూన్ 27న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమాలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ నాయికగా నటిస్తోంది. మంచు మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్ (Mohan Lal), అక్షయ్ కుమార్ (Akshay Kumar), ప్రభాస్ (Prabhas), కాజల్ (Kajal), శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ముఖేష్‌ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు.

Also Read: Trisha - Charmy: ఈనాటి ఈ బంధమే నాటిదో...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 09 , 2025 | 02:53 PM