NTR: తారక్ సన్నబడటం వెనుక రీజన్ ఏమిటీ...
ABN, Publish Date - Apr 18 , 2025 | 07:03 PM
యంగ్ టైగర్ యన్టీఆర్ తాజా చిత్రం కోసం బరువు తగ్గి మరీ నాజూగ్గా కనిపిస్తున్నారు. యన్టీఆర్ బక్కచిక్కడంపై పలు కథలు వినిపిస్తున్నాయి. కొందరు సన్నబడటానికి ఇంజెక్షన్స్ తీసుకున్నారని అంటున్నారు... మరికొందరు అది కాదంటున్నారు. చివరకు అసలైన విషయం తేలింది.
ఆరంభంలో ముద్దుగా బొద్దుగా అలరించిన యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR) ను నాజూగ్గా చూపిన తొలి చిత్రం రాజమౌళి (Rajamouli) తీసిన 'యమదొంగ' (Yamadonga) అనే చెప్పాలి... ఆ తరువాత నుంచీ ఫిజిక్ ను పాత్రలకు తగ్గట్టుగా మెయింటెయిన్ చేస్తూ సాగుతున్నారు జూనియర్ యన్టీఆర్... మధ్యలో 'టెంపర్' (Temper) సమయంలో బాడీని మంచి షేపులోకి తెచ్చుకొని ఫ్యాన్స్ ను మురిపించారు తారక్...అదే తీరున ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలోని పాత్ర కోసం బాగా సన్నబడ్డారు... అది చూసి ఆయన 'ఒజెంపిక్' ఇంజెక్షన్ తీసుకొని మరీ నాజూగ్గా మారారని ఓ టాక్ తకిటతధిమి అంటూ నాట్యం చేస్తోంది.
'దేవర' నింపిన ఉత్సాహం...
గతంలో తారక్ నాజూగ్గా మారడానికి లైపో సక్షన్ చేయించు కున్నారు. ఆ విషయాన్ని ఆయనే తెలిపారు... అప్పటి నుంచీ తగిన విధంగా వర్కవుట్స్ చేస్తూ, హెల్తీ డైట్ తో సాగుతున్నారు... ఇప్పుడు మరీ పీక్కుపోయినట్టుగా కనిపించడంతోనే పలు పుకార్లు షికారు చేస్తున్నాయి... వాస్తవానికి 'ఒజెంపిక్' ఇంజెక్షన్ చేసుకుంటే ఇన్సులిన్ పెరుగుతుంది... ఆరోగ్యంగా ఉండడమే కాదు, సన్నబడతారు కూడా... కొందరు ట్రైనర్స్ ఈ ఇంజెక్షన్ ను డాక్టర్స్ పర్యవేక్షణలో ఇప్పిస్తూ తమ చెంతకు చేరిన వారికి చక్కని షేప్ వచ్చేలా చేస్తూంటారు... తారక్ కు కూడా అలాగే చేశారని అంటున్నారు... కానీ, సన్నిహితులు మాత్రం కాదని చెబుతున్నారు... 'దేవర' (Devara) సక్సెస్ తారక్ లో ఉత్సాహం నింపిందని, జపాన్ లోనూ ఆ సినిమా ఇప్పటికే మూడువారాల రన్ చూడడం విశేషమని అంటున్నారు... ఆ ఆనందంలోనే వర్కౌట్స్ తో జూనియర్ సన్నబడ్డారని ఫ్యాన్స్ మాట!
క్రమశిక్షణ... పట్టుదల...
తారక్ పట్టుదలకు మారుపేరని 'యమదొంగ' సమయంలో రాజమౌళియే చెప్పారు... తన పాత్ర కోసం సన్నబడడమే కాదు, దానిని మెయింటెయిన్ చేయడానికి తారక్ హెల్తీ డైట్ ఫాలో అవుతూ, తగిన రీతిలో వర్కవుట్స్ చేస్తూంటారు... అదే ఆయన ఆరోగ్యరహస్యం అనీ చెబుతారు... ఇప్పుడు కూడా 'వార్ 2' (War -2)లో తన పాత్ర షూటింగ్ పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎక్సర్ సైజులు, అందుకు తగ్గ డైట్ మొదలెట్టారు... అందువల్లే ప్రశాంత్ నీల్ సినిమాలో వెంటనే ఎంట్రీ ఇవ్వలేదు... ఏప్రిల్ 22 నుండి షూటింగ్ లో పాల్గొంటారు... ఇదిలా ఉంటే అందులో తారక్ మరో కోణంలో కండలు తిరిగీ కనిపిస్తారని వినిపిస్తోంది... అంటే ముందుగా నాజూగ్గా కనిపించే పోర్షన్స్ పూర్తి చేసి, ఆ పై మళ్ళీ కండలు పెంచే పనిలో పడతారన్న మాట! ఏది ఏమైనా తాత తారక రామునిలాగే పాత్రలకు తగ్గట్టుగా బాడీని మలచుకోవడంలో తారక్ కూడా ఎంతో క్రమశిక్షణతో మెలగుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు... యంగ్ టైగర్ ఇంతలా శ్రమించి నటించబోతున్న ప్రశాంత్ నీల్ సినిమా ఏ రేంజ్ లో అభిమానులకు ఆనందం పంచుతుందో చూడాలి.
Also Read: Kamal Haasan: పెళ్ళి వేడుకల్లో మారుమ్రోగేలా జింగుచా సాంగ్....
Also Read: Samantha: సమంత శుభం పలికేది ఎప్పుడంటే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి