IT Raids on Tollywood: ఐటీ నెక్స్ట్ టార్గెట్ అల్లు అరవిందేనా?
ABN, Publish Date - Jan 24 , 2025 | 06:43 AM
IT Raids on Tollywood: "దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, అభిషేక్ పిక్చర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, సుకుమార్ రైటింగ్స్ తో పాటు మొత్తం 15 మంది నిర్మాతలు, ఫైనాన్షియర్లపై ఐటీ దాడులు జరిగాయి. మరి ఇందులో భారీ చిత్రాలను నిర్మించింది కేవలం దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ మాత్రమే. మరి ఇతరులపై దాడి ఎందుకు జరిగినట్లు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది"
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్న అంశం ఐటీ దాడులు. దీనిపై స్పందిస్తూ దర్శక నిర్మాతలు ఇవి సర్వసాధారణం రెండేళ్లకు ఒకసారి ఇలా జరుగుతూనే ఉంటాయి అని చెప్పుకొచ్చిన.. ఎన్నడూ లేని విధంగా ఐటీ శాఖ ఈ సారి 15 మంది సినీ ప్రముఖలపై దాడి జరపడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. అందరు ఇది ఫేక్ కలెక్షన్స్, టాక్స్ ఎగవేతల గురించి అని భావిస్తున్న విదేశీ పెట్టుబడులే ప్రధాన కారణం అనే కొత్త అంశం తెరపైకి వచ్చింది.
ఇప్పటికే దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, అభిషేక్ పిక్చర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, సుకుమార్ రైటింగ్స్ తో పాటు మొత్తం 15 మంది నిర్మాతలు, ఫైనాన్షియర్లపై దాడులు జరిగాయి. మరి ఇందులో భారీ చిత్రాలను నిర్మించింది కేవలం దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ మాత్రమే. మరి ఇతరులపై దాడి ఎందుకు జరిగినట్లు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దీనికి సమాధానం ఐటీ శాఖకి, నిర్మాతలకు మాత్రమే తెలియాలి. ఇది ఇలా ఐటీ శాఖ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది సరికొత్త చర్చగా మారింది. ఈ చర్చలో నెక్స్ట్ టార్గెట్ అల్లు అరవిందే అని గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే..
ప్రస్తుతం అరవింద్.. నాగ చైతన్యతో 'తండేల్' సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా జరిగిన ఈ ఫిల్మ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాం, చైతు కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందన్నారు. అలాగే ఈ సినిమాకి చైతు భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు పరోక్షంగా చెప్పేశారు. అయితే దీనికి ఐటీ దాడులకు సంబంధం ఏంటి అంటారా? ఉంది. ప్రస్తుతం జరుగుతున్న దాడుల ప్రకారం ఎక్కువ రెమ్యునరేషన్లు, ఎక్కువ బడ్జెట్లతో నిర్మాణమైన సినిమాలు, హయ్యెస్ట్ గ్రాసర్లపైనే దాడి జరుగుతుందని వినికిడి. దీంతో నెక్స్ట్ టార్గెట్ అరవిందే కానున్నారని టాక్ వినిపిస్తుంది.