Sreeleela: డేటింగ్‌లో శ్రీలీల? అక్కడ వాళ్ళిద్దరికీ పనేంటి?

ABN, Publish Date - Jan 09 , 2025 | 08:27 AM

Sreeleela: తాజాగా బి టౌన్‌లో ఓ యాక్టర్‌తో శ్రీలీల చక్కర్లు కొడుతూ కనిపించింది. ఇప్పటికే వాళ్లిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకుంటూ వార్తల్లో నిలిచారు. దీంతో వీళ్లిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ శ్రీలీలతో ఉన్న ఆ బాలీవుడ్ హ్యాండ్సమ్ హాంక్ ఎవరంటే..

sreeleela in B town with star hero kid

యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోను ట్రెండింగ్ లో నిలుస్తోంది. కొన్ని నెలల క్రితం వరకు ఆమె ఫ్లాప్స్ స్ట్రీక్ చూసి అంతా శ్రీలీల పని అయిపోయింది అనుకున్నారు. కానీ.. ఇటీవల రిలీజైన 'పుష్ప 2'లో ఆమె చేసిన 'కిస్సిక్' సాంగ్ తో నేషనల్ వైడ్‌గా విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు టాలీవుడ్ తో పాటు మిగతా వుడ్స్ కూడా ఆమె వెనుక క్యూ కట్టారు. ఇది ఇలా ఉంటే.. ప్రస్తుతం బి టౌన్‌లో ఓ యాక్టర్‌తో చక్కర్లు కొడుతూ కనిపించారు. దీంతో వీళ్లిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..


ప్రస్తుతం బీ టౌన్ లో శ్రీలీల తెగ చక్కర్లు కొడుతుంది. వరుసగా బాలీవుడ్ ప్రాజెక్టులను సొంతం చేసుకొని త్వరలోనే బాలీవుడ్ డెబ్యూ చేయనుంది. ఇప్పటికే కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ లో ఆమె కార్తీక్ ఆర్యన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. కాగా, తాజాగా ఆమె ముంబైలోని మాడోక్ ఫిల్మ్స్ ఆఫీస్ దగ్గర కనిపించారు. అదే సమయంలో అక్కడ బాలీవుడ్ పఠాన్ 'సైఫ్ అలీ ఖాన్' కుమారుడు ఇబ్రాహీం అలీ ఖాన్ కనిపించాడు. సోషల్ మీడియాలో ఒకటే హల్ చల్ చేసే వీరిద్దరూ డైరెక్ట్ గా కలవడంతో పలు అనుమానాలకు తావుతీస్తోంది. వీళ్లిద్దరు అక్కడే చాలాసేపు ముచ్చటించారు. ఒకరిని ఒకరు హాగ్ చేసుకొని, చాలా ఫోటోలు తీసుకున్నారు. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారా? అంటూ వార్తలు వస్తున్నాయి. మరికొందరు వాళ్ళు జెస్ట్ ఫ్రెండ్స్.. ఒక స్త్రీ, పురుషుడు కనిపిస్తే డేటింగ్ అనేస్తారా.. మీ అందరికి శ్రీలీల కిస్సిక్ సాంగ్‌లో చెప్పినట్లు దెబ్బలు పడాలి రోయ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.


ప్రస్తుతం ఆమె సిద్దు జొన్నలగడ్డ, రవితేజలతో సితార బ్యానర్ లో రెండు సినిమాలు సైన్ చేశారు. అఖిల్ అక్కినేనితో మరో సినిమాని ఆమె సితార బ్యానర్ లో సైన్ చేశారు. అలాగే నాగ చైతన్యతో విరూపాక్ష డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా శ్రీలీలే యాక్ట్ చేయనుంది. శివ కార్తికేయన్ 25వ సినిమాతో పాటు మరిన్ని బిగ్ ప్రాజెక్ట్స్ లలో జాయిన్ కానుంది.

Updated Date - Jan 09 , 2025 | 09:10 AM