SSMB29: మహేశ్ - రాజమౌళి చిత్రానికి హాలీవుడ్ టెక్నిషియన్లు
ABN, Publish Date - Apr 21 , 2025 | 04:13 PM
మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై అంచనాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయబోతున్నారట.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) కాంబోలో రూపొందుతున్న మూవీ ఎస్.ఎస్.ఎం.బి.29. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాపై హైప్ పీక్స్‌లో ఉంది. సాధారణంగా జక్కన్న సినిమాలు స్లో పేస్‌లో షూట్ అవుతాయి. కానీ ఈ సినిమా మాత్రం జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. ఫిబ్రవరి 2, 2025న హైదరాబాద్‌లో మొదలైన షూటింగ్.. ఒడిశాలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కాశీని తలపించే సెట్స్‌లో చిత్రీకరణ జరగ్గా... ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ షెడ్యూల్‌లో జాయిన్ అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే రీసెంట్ గా మరో షెడ్యూల్‌కు కూడా ప్లాన్ చేస్తుండగా.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
త్వరలో ప్రారంభం కానున్న షెడ్యూల్‌తో ఎస్.ఎస్.ఎం.బి.29 నెక్స్ట్ లెవెల్ యాక్షన్‌కి రెడీ అవుతోంది. హైదరాబాద్ లోనే జరగబోయే ఈ షెడ్యూల్‌లో మహేష్, ప్రియాంకచోప్రా (Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తో పాటు 3000 మంది జూనియర్ ఆర్టిస్టులతో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నట్టుగా తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ నేతృత్వంలో ఈ సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నారట. ఏప్రిల్ చివరి వారంలో రిహార్సల్స్ పూర్తి చేసి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని అంటున్నారు. రాజమౌళి డైరెక్షన్‌లో రానున్న ఈ భారీ సీక్వెన్స్ గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం అని ఫ్యాన్స్ అప్పుడే చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా 'వన్ నేనొక్కడినే' మూవీలో ఉన్నట్లుగా ఈ మూవీలో కూడా బోట్ ఛేజింగ్ సీన్ ఉంటుందని తెలుస్తోంది. దీనిని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించాలను కుంటున్నారట. దీంతో అక్కడి టెక్నిషియన్లు రంగంలోకి దిగుతున్నట్లు టాక్ నడుస్తోంది.
Also Read: Singer Pravashti: పాడుతా తీయగా పై ఫైర్ అయిన సింగర్
ఎస్.ఎస్.ఎం.బి. 29 కోసం ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకోవడంతో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ ను ఈ మూవీలో ఇన్వాల్వ్ చేస్తున్నాడు రాజమౌళి. సముద్రంలో జరిగే ఫైట్ సీక్వెన్స్ ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని, దీనికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ కూడా అదిరిపోయేలా ఉంటుందని అనుకుంటున్నారు. ఈ సన్నివేశాలను భారీ బ్లూమ్యాట్, గ్రీన్ మ్యాట్ లో క్లోజ్డ్ సర్క్యూట్ లో చిత్రీకరించాల్సి ఉంటుందట. దీని కోసం భారీ సెటప్ ను వేసినట్లు టాక్ రావడంతో ఘట్టమనేని అభిమానులు ఖుషి అవుతున్నారు. మరి అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ కలెక్షన్స్ పరంగా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read: ANR: ఏకకాలంలో మూడు భాషల్లో అల్లావుద్దీన్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి