Nani - Controversy: హాయ్ నాన్న.. వివాదం ఏంటంటే..
ABN, Publish Date - Jan 30 , 2025 | 04:59 PM
‘భీమసేన నలమహారాజ’ను (Bheemasena nalamaharaja)ఆధారంగా చేసుకుని నాని సినిమా హాయ్ నాన్న రూపొందించారని కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య అన్నారు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్ వేదికగా తాజాగా పోస్ట్ పెట్టారు.
నాని (Nani)హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రంపై కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య ( Pushkara Mallikarjunaiah) కామెంట్స్ చేశారు. రీమేక్ హక్కులు తీసుకోకుండానే తమ చిత్రాన్ని తెలుగులో ‘హాయ్ నాన్న’గా తెరకెక్కించారని ఆరోపించారు. తాను నిర్మించిన ‘భీమసేన నలమహారాజ’ను (Bheemasena nalamaharaja)ఆధారంగా చేసుకుని నాని సినిమా రూపొందించారని ఆయన అన్నారు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్ వేదికగా తాజాగా పోస్ట్ పెట్టారు. ఇలాంటి హేయమైన పనులు ఎలా చేస్తారు అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తండ్రీ కుమార్తెల భావోద్వేగ కథతో రూపొందిన ‘హాయ్ నాన్న’ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహించారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. తండ్రి పాత్రలో నాని యాక్టింగ్‌ను సినీ ప్రియులు ప్రశంసించారు. పలు అవార్డులు ఈ చిత్రం సొంతం చేసుకుంది.
‘భీమసేన నలమహారాజ’ చిత్రం కరోనా కారణంగా 2020లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. అరవింద్ అయ్యర్, అరోహి నారాయణ్, ప్రియాంక తిమ్మేశ్ కీలక పాత్రల్లో నటించారు. కార్తీక్ సర్గూర్ దర్శకత్వం వహించారు. రక్షిత్ శెట్టి, పుష్కర మల్లికార్జునయ్య ఈ సినిమాకు నిర్మాతలు. పాకశాస్త్రంలో చేయి తిరిగిన వ్యక్తి లతేషా. ఓసారి అతడు అనుకోకుండా సారా అనే అమ్మాయిని కలుస్తాడు. వేదవల్లి అనే అమ్మాయితో తనకున్న ప్రేమ కథను సారాకు చెబుతారు. ఆ తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? స?రా- లతేషా మధ్య ఉన్న బంధః ఏంటి? అన్నదే ఈ చిత్రం.