Gopichand: ఆ దర్శకుడితో హ్యాట్రిక్‌ కోసం..

ABN, Publish Date - Feb 04 , 2025 | 03:44 PM

మాస్ యాక్షన్ హీరోగ గోపీచంద్ కి మంచి గుర్తింపు ఉంది.  ఇప్పుడు అయన ఒక హ్యాట్రిక్‌ కొట్టడానికి సిద్థమయ్యారు. గోపీచంద్‌, సంపత్‌నంది నుంచి ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది. దీనికి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. 

గోపీచంద్‌(Gopichand), సంపత్‌ నంది(Samapath) Nandi)లది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌. ‘గౌతమ్‌నంద’ (Gowtham Nanda) ‘సిటీమార్‌’ Seetimaar) హిట్‌ అయ్యాయి. ‘గౌతమ్‌నంద’ థీమ్‌ బాగుంటుంది. గోపీచంద్‌ క్లాసీ లుక్‌లో అలరించాడు. సిటీమార్‌ కమర్షియల్‌గా మంచి టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్‌ కొట్టడానికి సిద్థమయ్యారు. గోపీచంద్‌, సంపత్‌నంది నుంచి ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది. దీనికి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం సంపత్‌ నంది శర్వానంద్‌తో ఓ సినిమా తీస్తున్నారు. ఈ నెలలోనే సెట్స్‌పైకి వెళ్తుంది. దీని తరవాత గోపీచంద్‌ సినిమా పట్టాలెక్కుతుంది. ఈలోగా గోపీచంద్‌ కూడా ఓ సినిమా పూర్తి చేస్తారు. Gopi chandi Hattrick movie with Sampath nandi)



ప్రస్తుతం శర్వాతో తీసే  సినిమాపై సంపత్‌ పూర్తి ఫోకస్‌ తో ఉన్నారు. ఈ సినిమా కోసం నగర శివార్లలో ఓ భారీ సెట్‌ తీర్చిదిద్దారు. దాదాపు 70 శాతం షూటింగ్‌ ఈ సెట్లోనే జరుగుతుంది. హీరోయిన్‌, విలన్‌ పాత్రల  ఎంపిక జరిగింది. త్వరలోనే టైటిల్‌తోపాటుగా మిగిలిన వివరాలు బయటకు వస్తాయి. 

Updated Date - Feb 04 , 2025 | 03:45 PM