Gandhi thatha chettu: సుకుమార్‌కు ఎంతో ప్రత్యేకం..

ABN, Publish Date - Jan 02 , 2025 | 09:40 AM

సుకుమార్‌ తన శిష్యుల్ని, తనకు ఇష్టమైన కథల్ని ఎంకరేజ్‌ చేయడానికి బ్యానర్‌ స్థాపించారు ఈసారి సుకుమార్‌ రైటింగ్స్‌ నుంచి ఓ ౅ప్రత్యేకమైన సినిమా రాబోతుంది.  అదే  'గాంధీ తాత చెట్టు’ (Gandhi thatha chettu). ఈ సినిమాలో సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్ర పోషించింది.


సుకుమార్‌ (Sukumar) ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రచయిత, దర్శకుడు, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక శైలిని క్రియేట్‌ చేసుకున్నారు. తన సొంత బ్యానర్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ నుంచి ఓ సినిమా వస్తోందంటే ఆ క్రేజ్‌ వేరుగా ఉంటుంది.  అంతేకాదు కమర్షియల్‌ గా ఆ బ్యానర్‌కు ఓ ట్రాక్‌ రికార్డు వుంది. తన శిష్యుల్ని, తనకు ఇష్టమైన కథల్ని ఎంకరేజ్‌ చేయడానికి ఈ బ్యానర్‌ స్థాపించారు లెక్కల మాస్టర్‌. ఈసారి సుకుమార్‌ రైటింగ్స్‌ నుంచి ఓ ౅ప్రత్యేకమైన సినిమా రాబోతుంది.  అదే  'గాంధీ తాత చెట్టు’ (Gandhi thatha chettu). ఈ సినిమాలో సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్ర పోషించింది. తబితా సుకుమార్‌ సమర్పకురాలిగా వ్యవహరించబోతోంది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మైత్రీ మూవీస్‌ భాగస్వామి.  ఈనెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రాన్ని పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించారు. అక్కడ అనేక అవార్డుల్ని ఈ సినిమా సొంతం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా కొన్ని పురస్కారాలు సుకృతి సొంతం చేసుకుంది. గాందీ ఆదర్శాలను పాటిస్తూ ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరి కోసం ఏం చేసిందన్నదే కథ. సోషల్‌ మీడియా సమాజాన్ని ఎలా భ్రష్టు పట్టిస్తుందో, అందులోంచి బయటపడాలంటే ఏం చేయాలో కూడా ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారట.. సుకుమార్‌ సహాయ సహకారాలు ఈ సినిమాకు పుష్కలంగా ఉన్నాయి. మైత్రీ మూవీస్‌ విడుదల చేస్తోంది. కాబట్టి ప్రమోషన్లకు  ఎలాంటి ఇబ్బంది లేనట్టే. అవార్డుల కోసం ఇలాంటి సినిమాలు తీసినా, వాటికి థియేటరికల్‌ రిలీజ్‌ కల్పించడం మామూలు విషయం కాదు. ఓ నిర్మాతగా, తండ్రిగా సుకుమార్‌కు ప్రత్యేకమే. ఇటీవలే సుకుమార్‌ కూడా ఈ సినిమాని చూశారు. తనయురాలిగా నటన మెచ్చుకున్నారు.  

Updated Date - Jan 02 , 2025 | 09:40 AM