Sukumar: మా పాపకు మంచి జ్ఞాపకంలాంటి సినిమా
ABN, Publish Date - Jan 17 , 2025 | 08:53 AM
‘‘గాంధీ తాత చెట్టు’ చాలా మంచి సినిమా. వినోదంతోపాటు మంచి సందేశమున్న చిత్రమిది’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు.
‘‘గాంధీ తాత చెట్టు’ (Gandhi Tatha Chettu) చాలా మంచి సినిమా. వినోదంతోపాటు మంచి సందేశమున్న చిత్రమిది’’ అని దర్శకుడు సుకుమార్ (Sukumar) అన్నారు. ఆయన కుమార్తె సుకృతి వేణి (Sukruthi Veni) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి పద్మావతి మల్లాది (Padmavathi) దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ ‘‘మా సుకృతికి పాడటం చాలా ఇష్టం. నటనపై మాత్రం అంత ఆసక్తి లేదు. అలాంటిది ఈ చిత్ర సెట్లో తన నటన చూసి చాలా షాక్ అయ్యా. అంత చక్కగా యాక్ట్ చేసింది. సుకృతికి ఇది మంచి జ్ఞాపకంలా మిగిలిపోతుంది. అలాగే దర్శకురాలు పద్మ ఈ స్ర్కిప్ట్‌ను చాలా అద్భుతంగా రాసుకుంది. తను కథ చెప్పిన విధానం వినే.. దీన్ని బాగా తెరకెక్కించగలదని నమ్మకం కలిగింది. నేను నమ్మినట్లుగా ఈ చిత్రాన్ని ఆమె చాలా తక్కువ సమయంలో ఎంతో అందంగా తెరకెక్కించింది. కచ్చితంగా తను భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకుంటుంది’’ అన్నారు.
‘‘ఈ చిత్రం చూసినప్పుడు.. ఎక్కడా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదు. చెట్టుకు.. మనిషికి ఉన్న బంధం.. దాన్ని గాంధీ సిద్థాంతాలకు ముడిపెట్టిన విధానం చాలా నచ్చింది. ఇది ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది’’ అని నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ అన్నారు. దర్శకురాలు పద్మావతి మల్లాది మాట్లాడుతూ.. ‘‘ఒక చెట్టుకు.. మనిషికి మధ్య ఓ ప్రేమకథ ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచి ఈ కథ సిద్థం చేసుకున్నా. సుకృతి ఈ కథలోని లోతును పరిపూర్తిగా అర్థం చేసుకుని... తన గాంధీ పాత్రను అద్భుతంగా చేసి చూపించింది. తెరపై ఆమె నటన చూశాక ప్రేక్షకులకు తనపై ఓ గౌరవం ఏర్పడిపోతుంది’’ అన్నారు.
రాగ్ మయూర్, ఆనంద్ చక్రపాణి, రఘురామ్ తదితరులు కీలక పాత్రధారులు. తబితా సుకుమార్ సమర్పణలో ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది.