Sandhya Theatre: 'గేమ్ ఛేంజర్' సంబరాలకు బ్రేక్.. హైదరాబాద్‌లో అవి లేనట్టే..
ABN, Publish Date - Jan 07 , 2025 | 10:56 AM
Sandhya Theatre: థియేటర్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి డీజేలు, బ్యానర్లు, డప్పులు, క్రాకర్స్, పూల దండాలు, కటౌట్లు పెట్టేందుకు వీలు లేదని ఆదేశించారు. ఒకవైపు సంక్రాంతి పండగ సందర్భంగా 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో సినీ సంబరాలకు కేరాఫ్ అడ్రస్ సంధ్య థియేటర్‌లో ఇక ముందు సంబరాలకు బ్రేక్ పడింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మాస్ పబ్లిక్ పల్స్‌ని బాగా అర్థం చేసుకొని బిజినెస్‌లో రాణిస్తున్నారు. అయితే గతేడాది అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా ప్రీమియర్స్ లో భాగంగా ఏర్పడిన తొక్కిసలాటలో సంధ్య 70mm థియేటర్ వద్ద ఒక మహిళా మృతి చెందగా, బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఒకవైపు సంక్రాంతి పండగ సందర్భంగా 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులు సంబరాలకు సిద్ధం కాగా పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రధానంగా 'గేమ్ ఛేంజర్' మూవీ రిలీజ్ నేపథ్యంలో సంధ్య 35mm థియేటర్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి డీజేలు, బ్యానర్లు, డప్పులు, క్రాకర్స్, పూల దండాలు, కటౌట్లు పెట్టేందుకు వీలు లేదని ఆదేశించారు. ఎలాంటి చిన్న సెలబ్రేషన్స్ అయినా పోలీసుల నుండి అనుమతి పొందాలి. అలాగే ఎలాంటి ఘటనలు జరిగిన నిర్వాహకులే పూర్తి వహిస్తామని డాక్యుమెంట్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికొస్తే.. రామ్‌చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కియారా అడ్వాణీ కథానాయిక. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు శంకర్ తెరకెక్కించారు. కార్తిక్ సుబ్బరాజు అందించిన కథ ఇది. రామ్‌చరణ్ ఇందులో రామ్‌నందన్, అప్పన్న అనే రెండు పాత్రల్లో నటించారు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే అప్పన్న పాత్ర సినిమాకు కీలకంగా ఉండనుందని ఇప్పటికే టీమ్ ప్రకటించింది. అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.