G2: శేష్ క్రైమ్ పార్ట్నర్ ఎవరో తెలుసా..

ABN, Publish Date - Jan 07 , 2025 | 12:28 PM

G2: ఈ సినిమాలో మరో కీలక పాత్రను పోషించేందుకు ఓ బాలీవుడ్ బ్యూటీ రెడీ అయ్యింది. ఈ విషయాన్నీ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే..

adivi sesh

అడివి శేష్ (AdiviSesh) నటించిన 'గూఢచారి' ఎంత‌టి విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. 2018లో విడుదలైన ఈ సినిమాకి కొనసాగింపుగా ఇప్పుడు ‘జీ2’ (G2) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హ‌స్మీ (Emraan Hashmi) విల‌న్‌గా న‌టిస్తుండ‌గా బ‌నితా సంధు (Banita Sandhu) హీరోయిన్‌గా మ‌ధుశాలిని, సుప్రియ యార్ల‌గ‌డ్డ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మరో కీలక పాత్రను పోషించేందుకు ఓ బాలీవుడ్ బ్యూటీ రెడీ అయ్యింది. ఈ విషయాన్నీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే..


'భలే మంచి రోజు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా బాలీవుడ్ బ్యూటీ 'వామిక గబ్బి' మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గర కానుంది. అడివి శేష్ ‘జీ2’లో శేష్ క్రైమ్ పార్ట్నర్ గా నటించనుంది. తాజాగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. స్టన్నింగ్ యాక్షన్ మోడ్ లో వామిక.. శేష్ పక్కన అదిరిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా సాగుతోంది. 2025 సెకాండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నెలలోనే ఒక అదిరిపోయే గ్లిమ్ప్స్ రానుంది.


పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ , అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా, శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

Updated Date - Jan 07 , 2025 | 12:36 PM