Jr NTR X FIFA World Cup: ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఎన్టీఆర్ క్రేజ్ చూస్తే మతిపోతుంది
ABN, Publish Date - Feb 06 , 2025 | 06:27 AM
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి ప్రవేశించడం ఏమో కాని ఇంటర్నేషనల్ మార్కెట్ టాలీవుడ్ పై కన్ను వేసేలా చేసింది. ఈ సినిమా తెచ్చిన క్రేజ్ తో ఎన్టీఆర్, చరణ్ ఎక్కడికెళ్లినా ప్రపంచ వ్యాప్తంగా గుర్తిస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెలుగు వారికి అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చింది. ఇక ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ దాసోహం అంటే.. మొత్తం ప్రపంచం డ్యాన్స్ వేసింది. ముఖ్యంగా అప్పటివరకు కేవలం తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమైన తారక్, చరణ్ టాలెంట్ ని మొత్తం ప్రపంచం విట్ నెస్ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ అన్ని రంగాలలో ఈ సినిమా రిఫరెన్సులను వాడారు. తాజాగా ప్రపంచంలోనే మోస్ట్ ఎలైట్ స్పోర్ట్, వెస్ట్రన్ ఆడియెన్స్ చెవికోసుకునే ఫుట్ ఫుల్ ఫిఫా వరల్డ్ కప్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ రిఫరెన్స్ వాడటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బుధవారం ఫుట్ బాల్ లెజెండ్స్ నెయ్‌మార్, టెవెజ్, రొనాల్డోల పుట్టినరోజు. ఒకే రోజు ముగ్గురు లెజెండ్స్ బర్త్ డే మాములుగా ఉండదు. ఈ నేపథ్యంలోనే ఫిఫా వరల్డ్ కప్ ‘ఆర్ఆర్ఆర్’ రిఫరెన్స్ తో ఈ ముగ్గురు ఆటగాళ్ల పోస్టర్ ని 'నాటు నాటు' డాన్స్ చేస్తున్నట్లు డిజైన్ చేశారు. అలాగే ముగ్గరి పేర్లనుండి మొదటి అక్షరాలను తీసుకొని హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్(NTR) అని పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. ఇండియన్ సినిమా, ఫుట్ బాల్ అభిమానులతో పాటు తెలుగు సినిమా అభిమానులు కూడా కామెంట్స్, లైక్స్ తో రచ్చ లేపారు. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ హీరో ఎన్టీఆర్ " హ్యాపీ బర్త్ డే నెయ్‌మార్, టెవెజ్, రొనాల్డో" అంటూ నవ్వుతూ.. రిప్లై ఇచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్’ తెచ్చిన క్రేజ్ తో ఎన్టీఆర్, చరణ్ ఎక్కడికెళ్లినా ప్రపంచ వ్యాప్తంగా గుర్తిస్తున్నారు.
మరోవైపు తారక్ మీడియా ద్వారా అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. కొంతకాలంగా ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాలేదు. రీసెంట్‌గా ఆయన నటించిన ‘దేవర’ మూవీ సంచలన విజయం అందుకున్నప్పటికీ.. ఎటువంటి సక్సెస్ మీట్‌ను నిర్వహించలేదు. ‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుకని గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేశారు కానీ.. చివరి నిమిషంలో ఆ వేడుకను రద్దు చేశారు. దీంతో అభిమానులకు, ఎన్టీఆర్‌కు దూరం పెరిగినట్లుగా భావించిన కొందరు అభిమానులు.. ఆయనను కలుసుకునేందుకు ఎక్కడెక్కడి నుండో పాదయాత్రలు చేసుకుంటూ వస్తుండటం నచ్చని ఎన్టీఆర్.. ఇటీవల ఓ సంచలన ప్రకటన చేశారు.
‘‘తనపై తన ఫ్యాన్స్ చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి ఎన్టీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసి.. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరినీ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని అనుమతులు తీసుకుని నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి.. అప్పటి వరకు అభిమానులు ఓర్పుగా ఉండాలని ఎన్టీఆర్ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో, ఫ్యాన్స్ తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. త్వరలోనే అభిమానులను కలుసుకునే వేడుకకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని ఈ ప్రకటనలో తెలిపారు.