Vishwambhara: విశ్వంభర ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చిన దర్శకుడు..
ABN, Publish Date - Jan 28 , 2025 | 01:23 PM
‘విశ్వంభర’ సినిమాకు సంబంధించి దర్శకుడు ఓ ఆసక్తికర అప్‌డేట్ పంచుకున్నారు. మ్యూజిక్ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు
చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా వశిష్ట (Vassista) దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara) . త్రిష (Trisha) కథానాయిక. యు.వి.క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. శరవేగంగా షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు ఓ ఆసక్తికర అప్‌డేట్ పంచుకున్నారు.
మ్యూజిక్ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. చిరంజీవి, కీరవాణి(MM Keeravani), చంద్రబోస్‌తో (Chandrabose) దిగిన ఫొటోను షేర్ చేసిన దర్శకుడు వశిష్ఠ.. అద్భుతమైన సంగీతాన్ని అందించినందుకు కీరవాణికి ధన్యవాదాలు తెలిపారు. ఆడియన్స్ ఈ పాటలు చూసి ఎంతో ఆనందిస్తారని ఆయన తెలిపారు. అలాగే ఈ సినిమాకు పని చేసిన సింగర్స్ టీమంతా కూడా ఫొటోలు షేర్ చేసి మెగా మోమెంట్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.