Sharwanand 38: నిన్న అనుపమా.. ఈ రోజు డింపుల్..
ABN, Publish Date - Apr 28 , 2025 | 03:43 PM
శర్వానంద్(Sharwanand), సంపత్ నంది (Sampath Nandi) కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సిటీమార్ తరవాత సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
శర్వానంద్(Sharwanand), సంపత్ నంది (Sampath Nandi) కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సిటీమార్ తరవాత సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్‌ను (Anupama Parameswaran)ఎంపిక చేసినట్లు ఇటీవల వెల్లడించారు. ఇందులో రెండో కథానాయికకు కూడా ఆస్కారం ఉంది. దాంతో ఆ ఛాన్స్ డింపుల్ హయాతీని (Dimple Hayathi) వరించింది. కిలాడీ సినిమాలో రవితేజ సరసన ఆడి పాడింది డింపుల్. ఆ తరవాత తనకు కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ దేన్నీ సద్వినియోగం చేసుకోలేదు.
ఇప్పుడు సంపత్ నంది సినిమాతో మరో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో డింపుల్ గ్లామర్‌కే పరిమితం కాలేదని, నటిగా తనలోని కొత్తకోణం ఆవిష్కరిస్తానని చెబుతోంది. శర్వా హీరోగా నటిస్తున్న 38వ చిత్రమిది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందించనున్నారు. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ వేశారు. 40 శాతం షూటింగ్ అక్కడే జరగబోతోంది. ఈ సెట్ కోసం దాదాపు రూ.4 కోట్లు ఖర్చు పెట్టారని చిత్ర బృందం చెబుతోంది.