Dil Raju: ఐటీ సోదాలపై దిల్ రాజు స్పందన ఇదే..
ABN, Publish Date - Jan 25 , 2025 | 12:14 PM
తెలిసీతెలియని విషయాలతో దీనిని బాగా హైలైట్ చేస్తున్నారు. 2008లో ఒకసారి ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు మా ఇళ్లు, కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయి. - Dil Raju
గత నాలుగు రోజులుగా దిల్ రాజు (Dil Raju)ఇల్లు, ఆఫీస్‌లలో జరిగిన ఐటీ సోదాలను (IT Raids) ఉద్దేశించి ఆయన స్పందించారు. శనివారం ఆయన విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ ‘‘ఈ నాలుగు రోజుల నుంచి ఈ విషయంపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. తెలిసీతెలియని విషయాలతో దీనిని బాగా హైలైట్ చేస్తున్నారు. 2008లో ఒకసారి ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు మా ఇళ్లు, కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయి. మధ్యలో మూడుసార్లు సర్వేలు చేసి అకౌంట్ బుక్స్ చెక్ చేశారు. వ్యాపార రంగంలో ఉన్న వారిపై ఇలాంటి దాడులు సర్వసాధారణం. ఈ దాడుల్లో మా ఇల్లు, కార్యాలయంలో ఇంత డబ్బు దొరికింది.. ఏవేవో డాక్యుమెంట్లు దొరికాయి అంటూ కొన్ని మీడియా సంస్థలు హైలైట్ చేశారు. మా దగ్గర అలాంటిది ఏమీ జరగలేదు. మావద్ద ఎలాంటి అనధికారిక డాక్యుమెంట్లు, డబ్బును అధికారులు గుర్తించలేదు. 20 లక్షల లోపు మాత్రమే ఉన్నాయి. ఐదు సంవత్సరాల నుంచి మేము ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేదు. 24 క్రాఫ్ట్స్‌లో లావాదేవిల డీటైల్స్ తీసుకున్నారు. పైనల్‌గా నా వద్ద డాక్యమెంట్స్ చెక్ చేశారు. డిపార్ట్‌మెంట్‌వారు ఆశ్చర్యపోయారు.. అంతా క్లీన్‌గా ఉందన్నారు. మా అమ్మ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో చికిత్స తీసుకుంటున్నారు. దయచేసి మామీద తప్పుడు వార్తలు వేయవద్దు.
ఎక్కువగా ఊహించు కోవద్దు...
నేనేమి టార్గెట్ అవ్వలేదు. నన్ను ఎవరూ టార్గెట్ చేయలేదు. ఎక్కువగా ఊహించుకొవద్దు.. ఎలాంటి హాడావుడి లేదు. ఇండస్ర్టీలో అంతా ఆన్‌లైన్‌లో బుకింగ్ .. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఇండస్ర్టీ అంతటా రైడ్స్ జరిగాయి. కలెక్షన్స్ ఎక్కువ చేసి చూపించటం మీద ఇండస్ర్టీ అంతా కూర్చొని మాట్లాడతాం. అది తప్పు.. తీరు మార్చుకోవాల్సిందే. రైడ్స్ జరగటం వల్ల్ల మేమెంత క్లీన్‌గా ఉన్నామో కూడా తెలుస్తుంది. ఫిబ్రవరి 3న ఐటీ అధికారులు కలవమన్నారు. ఆడిటర్స్ వెళ్లి కలుస్తారు. సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో 2025లో హిట్‌కు బోనీ చేశాం. ఇకపై ఎలా హిట్టు కొట్టాలనే పని మీదే ఉంటా.