Balakrishna: బాలయ్య సెంటిమెంట్ ఏంటో తెలుసా..
ABN, Publish Date - Jan 20 , 2025 | 08:39 AM
Balakrishna: సినీ ఇండస్ట్రీలో తారలకు సెంటిమెంట్స్ ఎక్కువే. అలాగే బాలకృష్ణ సెంటిమెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. ఆయన సెంటిమెంట్ బ్రేక్ చేసినప్పుడు ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో తాజాగా చెప్పుకొచ్చారు.
నందమూరి బాలకృష్ణకి ఎంతటి భక్తుడో చాలా మందికి తెలుసు. ఆయన ఆచార సంప్రదాయాలను, పూజలు, ముహుర్తాలు, నియమాలు కఠినమైన క్రమశిక్షణతో పాటిస్తారు. ఆయనకు సెంటిమెంట్స్ కూడా ఎక్కువే. అలాంటిది ఆయన ఒకసారి సెంటిమెంట్‌ని బ్రేక్ చేసి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదురుకున్నారట. తాజాగా ఈ విషయాన్ని టెలివిజన్ షో ద్వారా షేర్ చేసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
తాజాగా జరిగిన ఓ టీవీ షోలో ఆయన మాట్లాడుతూ.. “నాది మూల నక్షత్రం. ఆదివారం బ్లాక్ కలర్ వేయకూడదు. చాలా డేంజర్. ఏమౌతుందో చూద్దామని ఓసారి వేశాను. ఆదిత్య369 నిర్మాతల్లో ఒకరైన బాలసుబ్రమణ్యం గారు ఓసారి రాకరాక సినిమా షూటింగ్ కు వచ్చారు. ఆరోజు ఆదివారం. నేను కావాలని నలుపు రంగు షర్ట్ వేసుకొని వెళ్లాను. ఆదివారం వద్దని నా మైండ్ చెబుతూనే ఉంది, వినలేదు. బాలుగారి కళ్ల ముందే పడ్డాను, నా నడుము విరిగింది.” అని చెప్పారు. అప్పట్నుంచి సెంటిమెంట్లని బ్రేక్ చేసే సాహసం చేయలేదని చెప్పారు.
మరోవైపు సంక్రాంతికి రిలీజ్ అయినా బాలకృష్ణ 'డాకు మహారాజ్' బాక్సాఫీస్ వద్ద బలం ప్రదర్శిస్తుంది. బాలయ్య కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ దిశగా సాగుతోంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. " చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన కృష్ణమూర్తి(సచిన్ ఖేడ్కర్)విద్యావేత్త. ఓ పెద్ద స్కూల్‌ని నడుపుతుంటాడు. తనకు పెద్ద కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని లీజుకి తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు (రవి కిషన్) అక్కడ వన్య మృగాలను అక్రమంగా తరలిస్తుంటాడు. త్రిమూర్తులు అరాచకాలు హద్దుమీరడంతో పోలీసులు ఆశ్రయిస్తాడు కృష్ణమూర్తి. దీంతో పగ పెంచుకున్న త్రిమూర్తులు, కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవికి ప్రాణహాని తలపెట్టడానికి కిడ్నాప్ చేస్తాడు. ఈ ఆపద నుంచి గట్టెక్కించడానికి ఆ ఇంట్లో పని చేస్తున్న మకరంద్ దేశపాండే చంబల్‌లోని మోస్ట్ వాంటెడ్ మహారాజ్ (బాలకృష్ణ)కు కబురు పెడతాడు. మహారాజ్ నానాజీగా పేరు మార్చుకొని ఆ పాపకు చ రక్షణగా ఉండటానికి వస్తాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు? ఆ పాపకి తనతో వున్న సంబంధం ఏమిటి? ఈ కథలో బల్వంత్ ఠాకూర్ (బాబీ డియోల్) నందిని (శ్రద్థా శ్రీనాథ్) ఎవరు? అసలు మహారాజ్, నానాజీగా పేరు ఎందుకు మార్చుకున్నాడు. తన శత్రువర్గం ఎవరు" అన్నది కథ.