Sreeleela: శ్రీలీలను లాక్కుపోయాడు.. ఇదొక చేదు అనుభవం 

ABN, Publish Date - Apr 06 , 2025 | 04:40 PM

గ్లామర్ డాల్  శ్రీలీల (Sreeleela)కు చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో కొంతమంది ఆకతాయిలు అత్యుత్సాహం కనబరిచారు.

గ్లామర్ డాల్  శ్రీలీల (Sreeleela)కు చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో కొంతమంది ఆకతాయిలు అత్యుత్సాహం కనబరిచారు. ఆమె చేయి పట్టుకుని బలవంతంగా లాగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్‌గా మారాయి.

తెలుగులో వరుస చిత్రాల్లో నటిస్తున్న  ఆమె బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే. కార్తిక్‌ ఆర్యన్‌ హీరోగా అనురాగ్‌ బసు దర్శకత్వం వహిస్తున్న ప్రేమ కథా చిత్రంలో శ్రీ లీల నటిస్తున్నారు. ప్రస్తుతం  చిత్రీకరణ దశలో ఉంది. ఇందు కోసం చిత్రబృందం ఇటీవల డార్జిలింగ్‌కు వెళ్లింది. చిత్రీకరణ అనంతరం కార్తిక్‌ ఆర్యన్‌తో కలిసి ఆమె తిరిగి వస్తుండగా.. వారిని చూసేందుకు స్థానికులు, అభిమానులు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే కార్తిక్‌ వారికి అభివాదం చేసుకుంటూ ముందు నడవగా.. ఆ వెనుకే శ్రీలీల నవ్వుకుంటూ వచ్చారు. చుట్టూ బాడీగార్డులు   సెక్యూరిటీ ఉన్న  గుంపులో నుంచి కొంతమంది ఆకతాయిలు ఆమె చేయి పట్టుకుని బలవంతంగా లాగారు. దీంతో ఆమె  షాకయ్యారు. వారిని విడిపించుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన సిబ్బంది.. ఆమెను సురక్షితంగా అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు.

 

Updated Date - Apr 06 , 2025 | 09:27 PM