Chiranjeevi false News: చిరంజీవి.. ఆ వార్తల్లో నిజం లేదు..
ABN, Publish Date - Mar 01 , 2025 | 10:35 PM
మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) మరో అరుదైన గౌరవం అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఆయనకు యుకె గవర్నమెంట్ (UK Government) ఆయనకు యు.కె సిటిజన్ షిప్ (Citizenship False news) ఇచ్చి గౌరవించిందని ప్రచారం జరుగుతోందని, ఆ వార్తలో నిజం లేదని తెలిసింది. ఆయన సన్నిహితుల ద్వారా చిత్రజ్యోతికి అందింది.
అయితే చిరంజీవిని యుకెలో సన్మానించెందుకు (Chiranjeevi false news) అక్కడ ఓ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ప్లాన్ ఏదైనా ప్రస్తుతం చిరంజీవి ఆ కార్యక్రమానికి కూడా హాజరుకావటం లేదని తెలిసింది. ఇటీవల దుబాయ్ వెళ్లొచ్చిన చిరంజీవి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలో విశ్వంభర పనుల్లో నిమగ్నం కానున్నారు.