Chiranjeevi: మహిళా దినోత్సవం.. చిరు శుభాకాంక్షలు

ABN, Publish Date - Mar 08 , 2025 | 10:17 AM

మహిళా దినోత్సవం సందర్భంగా  మెగాస్టార్  చిరంజీవి శుభాకాంక్షలు తెలుపుతూ  శుక్రవారం  ఓ ప్రత్యేక ఫొటోను పంచుకున్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా  మెగాస్టార్  చిరంజీవి (Chiranjeevi)  శుభాకాంక్షలు తెలుపుతూ  శుక్రవారం  ఓ ప్రత్యేక ఫొటోను పంచుకున్నారు. తనతో నటించిన నాయికలతో పాటు తన భార్యతో (Surekha) కలిసున్న ఫొటోని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్‌కి, మహిళలు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’’అని ట్వీట్లో  పేర్కొన్నారు. (Chiranjeevi Womens day wishes). ఈ ఫొటోలో చిరంజీవి భార్య సురేఖతో పాటు సీనియర్‌ నటీమణులు ఖుష్బూ, నదియా, రాధిక, సుహాసినీ, మీనా, జయసుధ, టబు ఉన్నారు. 


సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర'తో (Vishwambhara) బిజీగా ఉన్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వీఎఫ్ఎక్స్ తదితర పనుల్లో ఉంది. తదుపరి చిరు మరో రెండు సినిమాలు కమిట్ అయ్యారు. అనిల్ రావిపూడితో ఓ సినిమా, శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయబోతున్నారు.    

Updated Date - Mar 08 , 2025 | 10:25 AM