Chiranjeevi: చిరు - అనిల్ రావిపూడి సినిమా విలన్ ఎవరంటే..
ABN, Publish Date - Apr 27 , 2025 | 04:01 PM
చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విలన్‌గా యువ హీరో కార్తికేయ (Karthikeya) నటిస్తున్నాడన్నది టాక్. ‘గాడ్ ఫాదర్’లోనూ చిరు ఇలాంటి ప్రయత్నమే చేశాడు. ఆ సినిమాలో సత్యదేవ్ విలన్‌గా నటించాడు. చిరుకి సత్యదేవ్ పెద్ద అభిమాని. కాబట్టి సత్యదేవ్‌కి ఆ రూపంలో ఓ ఫ్యాన్ బోయ్ మూమెంట్ ఇచ్చారు చిరంజీవి. అనిల్ రావిపూడి సినిమా విషయానికొస్తే.. కార్తికేయ కూడా చిరంజీవికి వీరాభిమానే. ఈ విషయం చాలా సందర్భాల్లో చెప్పాడు. ఓ స్టేజ్‌పై చిరు పాటకు ఆయన ముందే స్టెప్పులు వేసి, ఆయన మరింత దగ్గరయ్యాడు. అందుకే చిరు సినిమాలో కార్తికేయ విలన్ అనేసరికి ఇంట్రస్ట్ క్రియేట్ అయింది.