Guess The Star: ఈ కిడ్ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ మోన్‌స్టార్

ABN, Publish Date - Jan 21 , 2025 | 11:37 AM

Guess The Star: ఈ కిడ్ ఎవరో కాదు వరుసగా తన సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ని ఊచకోత కోస్తున్న.. ఈ హీరోకి అమ్మాయిలలో పిచ్చి క్రేజ్ ఉండేది. ఆయన కామెడీ టైమింగ్ కూడా అల్టిమేట్ కానీ..

Guess The Star

పై ఫొటోలో నోట్లో వేలు పెట్టుకొని అమాయకంగా, క్యూట్ గా కనిపిస్తున్న బాబు ఎవరో మీకు తెలుసా? తెలియకపోతే కొన్ని హింట్స్ ఇస్తాము గెస్స్ చేయండి. తెలిసిన వాళ్ళు అయితే.. ఇది ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ కాబట్టి మీరు కూడా స్కిప్ చేయకుండా చదవండి. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌కి ఊపిరి అయినా ఈ స్టార్ తెలుగువాడే. పేరుకే పెద్ద పేరు ఉన్న తనలాగే సింపుల్ గా చిన్న పేరుతోనే అందరికీ పరిచయం.


ఈ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తర్వాత బహుశా స్టార్ అవుతాడేమో అని కొందరు ఊహించవచ్చు కానీ.. ఈయన అతి తక్కువ కాలంలోనే ఎవ్వరు ఊహించని, అందుకొని స్థాయికి వెళ్తాడని ఊహించి ఉండరు. ఈ హీరోకి అమ్మాయిలలో పిచ్చి క్రేజ్ ఉండేది. ఆయన కామెడీ టైమింగ్ కూడా అల్టిమేట్ కాని పాన్ ఇండియా అప్పీల్ కోసం దానిని తుంగలో తొక్కేశారు. ఇప్పటికే మీరు ఆ హీరోని గుర్తు పట్టేసి ఉంటారు.


అవును.. ఈ కిడ్ ఎవరో కాదు వరుసగా తన సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని ఊచకోత కోస్తున్న.. ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు అలియాస్ ప్రభాస్, డార్లింగ్ అండ్ సో ఆన్.

మరోవైపు ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీ విషయానికొస్తే.. ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన సినిమా వాయిదా అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారో, డైరెక్టర్ మారుతి అలా "రాజా సాబ్" మూవీని రూపొందిస్తున్నారు. భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్‌గా ప్రొడ్యూస్ చేస్తోంది. 'రాజా సాబ్' పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం 80% షూటింగ్ ముగిసింది.

Also Read- Dil Raju: 'దిల్ రాజు'పై ఐటీ దాడులు..

Also Read-Ram Gopal Varma: ఫ్యాన్స్‌ని ఏడిపించేసిన ఆర్జీవీ.. కంబ్యాక్ స్ట్రాంగర్ వర్మ

Also Read-Pushpa 2: సంధ్యలో పుష్ప గాడి ర్యాంపేజ్..

Also Read- Anil Ravipudi: 'బుల్లిరాజు'పై విమర్శలు.. చెక్ పెట్టిన అనిల్ రావిపూడి

మా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 21 , 2025 | 11:47 AM