Gopichand: గోపి చంద్ -  బీవీఎస్ఎన్ కొత్త సినిమా షురూ 

ABN, Publish Date - Apr 25 , 2025 | 10:27 AM

మాచో స్టార్ గోపీచంద్‌ హీరోగా  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై  బీవీఎస్ఎన్ ప్రసాద్ ఓ సినిమా తెరకెక్కనుంది.

మాచో స్టార్ గోపీచంద్‌ (Gopichand) హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై  బీవీఎస్ఎన్ ప్రసాద్ ఓ సినిమా తెరకెక్కనుంది. ‘సాహసం’ తర్వాత గోపీచంద్ మళ్లీ ఈ బ్యానర్‌లో చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా గురువారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. థ్రిల్లర్‌ కథతో  కుమార్ సాయి (kumar sai) దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. అద్భుతమైన కథనం, గోపీచంద్ యాక్షన్, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం రాబోతోందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. 

మలయాళ నటి మీనాక్షి దినేష్, గోపీచంద్ సరసన కథానాయికగా నటించనుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. నటీనటులు, ఇతర సిబ్బంది గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.  శామ్‌దత్ ISC సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. 

Updated Date - Apr 25 , 2025 | 10:27 AM