RC16: బుచ్చిబాబుకు అంత నమ్మకం ఏంటో..  

ABN, Publish Date - Feb 19 , 2025 | 01:00 PM

బాపు’ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా బుచ్చిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ సినిమాపై ఆయన ఆసక్తికర కామెంట్‌ చేశారు. ‘


గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌(Ram Charan), 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబినేషన్‌లో ఆర్‌సీ 16 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. తాజాగా నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బాపు’ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా బుచ్చిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ సినిమాపై ఆయన ఆసక్తికర కామెంట్‌ చేశారు. ‘‘మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. ఆయన మా నుంచి భౌతికంగా దూరమై ఏడాది అవుతోంది. ‘ఉప్పెన’ (Uppena) సినిమా విడుదల సమయంలో ఆయన చేసిన పని ఇంకా గుర్తుంది. థియేటర్‌ గేట్‌ బయట నిలబడి ‘సినిమా బాగుందా’ అని వచ్చిన వారందరినీ అడిగేవారట. ఆయన సినిమా కూడా చూడకుండా థియేటర్‌కు వచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. నేను ప్రస్తుతం తీస్తున్న రామ్‌చరణ్‌ సినిమా బాగుందా అని ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కచ్చితంగా హిట్‌ అవుతుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ప్యాన్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఇటీవల శంకర్‌ దర్శకత్వంలో చరణ్‌ హీరోగా వచ్చిన భారీ చిత్రం గేమ్‌ ఛేంజర్‌ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో అభిమానులు ఆరర్‌సీ 16పై అంచనాలె పెంచుకున్నారు.  


‘బాపు’ ఈవెంట్‌కు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కూడా అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలుగు ఆడియన్స్‌ చాలా మంచివాళ్లు. సినిమా బడ్జెట్‌ను చూడరు. కథ బాగుంటే కచ్చితంగా హిట్‌ చేస్తారు. ఈ సినిమా కూడా హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. నేను తండ్రి అయిన తర్వాత ఆ గొప్పతనం తెలిసి వచ్చింది’’ అని అన్నారు.  

Updated Date - Feb 19 , 2025 | 01:00 PM