Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ చూసిన దగ్గుబాటి పురందేశ్వరి స్పందనిదే..
ABN, Publish Date - Jan 15 , 2025 | 10:16 PM
జనవరి 12న సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలోకి వచ్చిన ‘డాకు మహారాజ్’ థియేటర్లలో తాండవం చేస్తోంది. ముఖ్యంగా బాలయ్యని ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా బాబీ చూపించాలని, విజువల్స్ అదిరిపోయాయనేలా టాక్‌ని ఈ సినిమా సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై బాలయ్య సోదరి, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు.
మా బాలయ్య నటసింహం అని అన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి. నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రాన్ని చూసిన ఆమె.. సినిమా చాలా బాగుందని చెప్పుకొచ్చారు. బాపట్ల జిల్లా, చీరాలలోని మోహన్ థియేటర్‌లో ‘డాకు మహారాజ్’ సినిమాను తన కుటుంబంతో కలిసి చూశారు దగ్గుబాటి పురందేశ్వరి. సినిమా చూసిన అనంతరం.. ‘డాకు మహారాజ్’ సినిమా తనకు ఎంతో నచ్చిందని, బాలయ్య నటనలో నటసింహమని కొనియాడారు తెలిపారు. ఆమె మాట్లాడుతూ..
‘‘ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది. సామాజిక, సందేశాత్మక అంశాలతో దర్శకుడు చాలా మంచి సినిమా తీశారు. ఇందులో బాలకృష్ణ నటన అద్భుతంగా ఉంది. ఏదైనా సేవ చేస్తే.. చేసిన వారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు అనేది ప్రధానంగా ఈ సినిమాలో చూపించారు. నిరంతరం సేవ చేసే వ్యక్తి ప్రజల మనసులలో చిరకాలం గుర్తుండిపోతారు. బాలకృష్ణ నటసింహం అని డాకు మహారాజ్ ద్వారా మరోసారి నిరూపితమైంది. బాలకృష్ణకు, చిత్ర బృందానికి అభినందనలు. మంచి సినిమా తీసిన దర్శకుడు బాబీకి, సినిమా నిర్మాతలకు అభినందనలు’’ అని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.
Also Read-Sankranthiki Vasthunnam Review: వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలా ఉందంటే
జనవరి 12న సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా వంటివారు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రానికి మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. బాలకృష్ణను దర్శకుడు బాబీ కొత్తగా చూపించారని, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాని రూపొందించారని, ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయనేలా ‘డాకు మహారాజ్’ టాక్‌ని సొంతం చేసుకుంది. కలెక్షన్స్ కూడా బాలయ్య కెరీర్‌లో ఇప్పటి వరకు లేని విధంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి.