Balakrishna Favourite Heroines: బాలయ్య ఫేవరెట్ హీరోయిన్లు ఎవరో తెలుసా..
ABN, Publish Date - Feb 04 , 2025 | 07:51 AM
Balakrishna Favourite Heroines: నందమూరి బాలకృష్ణ తన సినిమాల్లోని హీరోయిన్లతో మంచి సత్సంబంధాలను కొనసాగిస్తాడు. మరి వందకుపైగా చిత్రాలలో నటించిన బాలయ్య ఫెవరేట్ హీరోయిన్స్ ఎవరో తెలుసా!
పద్మ భూషణడు బాలకృష్ణ పైకి యాంగ్రీగా కనిపించిన ఎంత సున్నిత మనస్కుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఫంక్షన్ లలో బాలయ్య.. బాల కృష్ణుడు అయిపోతాడు. సరిగ్గా ఇలాంటి వేదికపైనే బాలకృష్ణను తన సోదరి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి ఆటపట్టించింది. ఇటీవల హైదరాబాద్ శివారులోని చంద్రబాబు ఫార్మ్ హౌస్ లో బాలయ్యకు పద్మ భూషణ్ వరించిన నేపథ్యంలో భువనేశ్వరి పార్టీ ఇచ్చారు. ఇందులోనే ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
సరదాగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భువనేశ్వరి.. బాలయ్య నీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు అని అడిగింది. దీంతో బాలయ్య ఇరకాటంలో పడినట్లు చేశాడు. మొదట తన భార్య వసుంధర పేరు చెప్పినా తర్వాత భువనేశ్వరి వాదించడంతో తన టాప్ 3 హీరోయిన్స్ పేరు చెప్పేశాడు. వందకు పైగా చిత్రాలలో నటించిన బాలయ్య 17 చిత్రాలలో తనతో నటించిన విజయశాంతి తన ఫెవరేట్ హీరోయిన్ అని చెప్పాడు.
వీళ్ళిద్దరిది సెన్సేషనల్, సూపర్ హిట్టు కాంబో.. అప్పట్లో వీళ్ళిద్దరిపై అనేక రూమర్స్ కూడా చక్కర్లు కొట్టాయి. వీళ్లిద్దరి కాంబోలో కథానాయకుడు, పట్టాభిషేకం, ముద్దుల క్రిష్ణయ్య, దేశోద్ధారకుడు, అపూర్వ సహోదరులు, భార్గవ రాముడు, మువ్వగోపాలుడు, భానుమతి గారి మొగుడు, భలే దొంగ, ముద్దుల మావయ్య.. వంటి సినిమాలు 90% సక్సెస్ రేటుతో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
ఇక రెండో స్థానంలో రమ్య కృష్ణ, మూడో స్థానం సిమ్రాన్ అని బాలయ్య చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా 90స్ కిడ్స్ బాలకృష్ణ, సిమ్రాన్ కలిసి నటించిన సమరసింహారెడ్డి ఎప్పటికీ మరిచిపోలేరు.
ప్రస్తుతం బాలయ్య చెప్పిన ఈ లిస్ట్ గురించి సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలయ్య.. ప్రగ్యా జైశ్వాల్ పేరు మరిచిపోయాడని పలువురు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.