Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్...

ABN, Publish Date - Apr 07 , 2025 | 12:35 PM

ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమా 'వచ్చిన వాడు గౌతమ్'. ఈ మెడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ త్వరలో జనం ముందుకు రాబోతోంది.

అశ్విన్ బాబు (Ashwin Babu) హీరోగా నటిస్తున్న సినిమా 'వచ్చిన వాడు గౌతమ్' (Vachinavaadu Gowtham) . మామిడాల ఎం. ఆర్. కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాను టి. గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. మెడికల్ యాక్షన్ మిస్టరీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే 90 శాతం పూర్తయ్యింది. బేలెన్స్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసుకుని, త్వరలో మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని చెబుతున్నారు.


తాజాగా దర్శక నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించిన రెండు పోస్టర్స్ ను విడుదల చేశారు. అందులో బ్లెడ్ అంగ్ స్టెత్ తో ఉన్న అశ్విన్ బాబు కనిపిస్తున్నాడు. మేకర్స్ ఇదో మెడికల్ యాక్షన్ మిస్టరీ మూవీ అని పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పారు. పలు చిత్రాలలో హీరోగా నటించిన సాయి రోనక్ ఇందులో అతిథి పాత్ర పోషించాడు. ఇతర ప్రధాన పాత్రలను రియా సుమన్ (Rhea Suman), అయేషా ఖాన్ (Ayesha Khan), మురళీశర్మ (Murali Sharma), సచిన్ ఖేడేకర్ (Sachin Khedekar), అభినయ, అజయ్, వీటీవీ గణేశ్ తదితరులు చేశారు. ఈ మూవీకి 'హను-మాన్' ఫేమ్ గౌర హరి (Gaura Hari) సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: Tollywood: ఆ రెండు సినిమాలు తెలుగులో రావట్లేదు...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 07 , 2025 | 12:39 PM