Ram- Bhagya Shri: ఒకే గదిలో రామ్ , భాగ్యశ్రీ..

ABN, Publish Date - Apr 21 , 2025 | 06:22 PM

ఎనర్జిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రేమ లోకంలో విహరిస్తున్నాడన్న న్యూస్ వైరల్ గా మారింది. దీంతో రామ్ మనసు దోచిన బ్యూటీ ఎవరా అని ఆరాలు తీస్తున్నారు నెటిజన్లు.

ఒక హీరో, ఒక హీరోయిన్ కలసి రెండుమూడు సార్లు వరుస సినిమాల్లో నటించారంటే ఆ హీరో, హీరోయిన్ కి లింక్ పెట్టేస్తారు సినీజనం. హీరోహీరోయిన్స్ మధ్య ఏదో నడుస్తుంది… అందుకే ఆ హీరో.. ఆ హీరోయిన్ కి వరుసగా తన సినిమాల్లో అవకాశాలిస్తున్నాడు అంటూ ఊదరగొట్టేస్తారు. గతంలో సాయి దుర్గా తేజ్(Sai Durga Tej), రెజినా(Regina) మధ్య రూమర్స్ నడిపిన గాసిప్ రాయుళ్ళు.. మొన్నీమధ్యన నితిన్ (Nithiin)కి, మేఘ ఆకాశ్ (Megha akash) కి లింక్ పెట్టారు. ప్రభాస్ (Prabhas), కృతిసనన్ (KritiSanon), అనుష్కశెట్టి (Anushka Shetty)పేర్లు గట్టిగా వినిపించాయి. తాజాగా రామ్ పొతినేని (Ram Pothineni) పై అలాంటి రూమర్ ఒకటి బాగా స్ప్రెడ్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. పైగా ఫస్ట్ టైం నటిస్తున్న బ్యూటీతో సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందంటూ కథలు రాయడం చర్చనీయాంశంగా మారింది.


మామూలుగా హీరో హీరోయిన్లు కలసి తిరిగితే, వారి మధ్య ఏదో నడుస్తుందని పుకార్లు షికార్లు చేస్తుంటాయి. వాళ్ళ మధ్య లవ్ స్టోరీ నడుస్తున్నా... కెమెరాకు చిక్కినప్పుడు... కో స్టార్ అంటూ ఫ్రెండ్స్ అంటూ బుకాయిస్తూ ఉంటారు. కానీ ఓ హీరో విషయంలో లవ్‌ టాపిక్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు. ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా నిలిచిన రామ్, భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)తో ప్రేమలో పడినట్లు కథలు వినిపిస్తున్నాయి. ఈ హీరోయిన్ తో ఫస్ట్ టైం మూవీ చేస్తున్నాడు. పైగా సినిమా కంప్లీట్ కాకముందే... గాసిప్ రాయుళ్ళ కన్నుల్లో పడిపోయిందీ జోడి.

షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య లవ్ మొదలైందని.. ప్రెజెంట్ డేటింగ్ లో ఉన్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తాజాగా హోటల్ గది నుంచి రామ్, భాగ్యశ్రీ వేర్వేరుగా ఫొటోలు షేర్ చేయగా.. అవి ఒకే గది నుంచి తీసినవని.. ఇద్దరూ కలిసే ఉన్నారని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. అంతేకాక మీ చేతికి రింగ్ ఎవరు తొడిగారు అంటూ డైరెక్ట్ గా భాగ్యశ్రీని ఓ నెటిజన్ అడగ్గా... చిన్నది అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ఉంగరం తానే కొనుక్కున్నట్లు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. దీంతో బ్యూటీ రిప్లై.. ఒకే బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఈ జోడి రష్మిక , విజయ్ దేవరకొండలను ఫాలో అవుతున్నారని... వారిలాగే వీరు కూడా ఒకే చోట ఉన్న ఫోటోలు విడివిడిగా పోస్ట్ చేసి దొరికిపోతున్నారని జనం అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలేంటో తేలాల్సి ఉంది.

Updated Date - Apr 22 , 2025 | 12:56 PM