AR Rahman: రెహమాన్‌ ఆస్తుల విలువ ఎంతో తెలుసా

ABN, Publish Date - Apr 29 , 2025 | 05:21 PM

ఏఆర్ రెహమాన్ వరల్డ్ వైడ్‌గా మరోసారి వార్తల్లో నిలిచారు. వివాదాల్లో చిక్కుకున్న ఆయన ఆస్తులపై ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది.

ఇప్పుడు ఎక్కడ చూసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎ. ఆర్. రెహమాన్ (AR Rahman) పేరు మారుమ్రోగుతోంది. ఎన్నో అద్భుతమైన పాటలతో మ్యూజిక్ లవర్స్ మనసు దోచుకున్న రెహమాన్... పర్సనల్ , ప్రొఫెషనల్ లైఫ్ తో ఈ మధ్య హాట్ టాపిక్ గా మారుతున్నాడు. మొన్నటి మొన్న భార్యతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచాడు. రీసెంట్ గా కాపీ క్యాట్ అంటూ అతనిపై కథనాలు వచ్చాయి. ఈ మ్యాటర్ మరిచిపోకముందే... మరో రెహమాన్ గురించి హాట్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. పైగా ఆ మ్యాటర్ తెలుసుకుని నెటిజన్స్ ఔరా అనేస్తున్నారు.


సంగీత ప్రపంచంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు రెహమాన్. 'రోజా' (Roja) సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిల్మ్ స్టార్ట్ చేసిన రెహమాన్... ఇప్పటి వరకు రెండుసార్లు ఆస్కార్ అవార్డ్ అందుకున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించాడు. అతనికి సంగీత‌మే ప్రపంచం... అదే లోకం కూడా. ఎప్పుడైతే మ‌ణిర‌త్నం 'రోజా' సినిమా తీశాడో ఆనాటి నుంచి మేటి మ‌రాఠా యోధుడు శంభాజీ జీవిత చ‌రిత్ర 'ఛావా' వరకూ సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇప్పటి వరకూ 150 చిత్రాలకు మ్యూజిక్ అందించడంతో పాటు, ఒక్కొక్క పాటకు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ సెన్సేషన్ గా మారాడు ఎ.ఆర్. రెహమాన్. సినిమా నేపథ్య సంగీతానికి నాలుగు నుంచి 10 కోట్లు... స్పెషల్ ప్రొగ్రామ్స్ కి మూడు నుంచి ఐదు కోట్ల వరకు రెహమాన్ డిమాండ్ చేస్తాడని టాక్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం వసూలు చేసే మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రెహమాన్ ఆదాయం తెలిస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే. స్టార్ హీరోల కంటే అతని ఆదాయం ఎక్కువని అని చెబుతుంటారు.


భారత్ లో అత్యంత ధనవంతులైన సంగీత దర్శకులలో ఎ.ఆర్. రెహమాన్ ఒకరుగా నిలిచారు. నివేదికల ప్రకారం ఇప్పటివరకు రెహమాన్ ఆస్తి రూ. 1,728 కోట్లు అట. సినిమాలు, సాంగ్స్, లైవ్ ఈవెంట్స్ ద్వారా మాత్రమే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతోనూ బాగానే సంపాదిస్తున్నాడు ఎ.ఆర్. రెహమాన్. బెవర్లీ హిల్స్‌ లో 25 కోట్ల విలువైన ఇల్లు ఉంది అతనికి. 1992లో ఎ.ఆర్. రెహమాన్ మొదటి స్టూడియో 'పంచతన్'ను ఏర్పాటు చేశాడు. ఈ స్టూడియో అతగాడికి ప్రయోగశాల.. ఆలయం! తరువాత ఏఎం స్టూడియోస్ స్థాపించాడు. ఇది భారతీయ, అంతర్జాతీయ కళాకారులకు గమ్యస్థానంగా మారిన అత్యాధునిక ఆడియో ప్రొడక్షన్ సూట్. ఇండియాలోనే కాదు లాస్ ఏంజిల్స్‌లోని ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ ఉంది. ఇది అతడు స్టూడియోగా ఉపయోగిస్తున్నాడు. దుబాయ్, లండన్, ఇతర దేశాలలోనూ రెహమాన్ సొంత స్టూడియోస్ ఉన్నాయి. ఇక రెహమాన్ కు కార్లు అంటే ఆసక్తి ఎక్కువ. అతడి గ్యారేజీలో వోల్వో ఎస్.యు.వి.తో పాటు మూడు కోట్ల విలువ చేసే మెర్సిడెస్-బెంజ్ , కోటి రూపాయల జాగ్వార్, పోర్స్చే టైకాన్ ఇ.వి. కార్లు ఉన్నాయి. మొత్తంగా దాదాపు 8 కోట్ల విలువ చేసే కార్లు అత‌డి గ్యారేజీలో ఉన్నాయంటారు. ఏదేమైనా... రెహమాన్ సంగీత ప్రపంచంలోనే కాదు.. ఆదాయంలోనూ టాప్ లో నిలిచి హాట్ టాపిక్ గా మారాడు.

Updated Date - Apr 29 , 2025 | 05:21 PM