Beauty: అంకిత్ కొయ్య హీరోగా ‘బ్యూటీ’  మోషన్ పోస్టర్స్

ABN, Publish Date - Feb 14 , 2025 | 10:41 AM

'త్రిబాణదారి బార్బరిక్' అంటూ ఓ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీతో వానరా సెల్యూలాయిడ్ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రెడీ అవుతోంది.


ఆయ్, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం వంటి హిట్ చిత్రాల్లో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న అంకిత్ కొయ్య ఇందులో హీరోగా నటిస్తున్న చిత్రం 'బ్యూటీ'.  'త్రిబాణదారి బార్బరిక్' అంటూ ఓ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీతో వానరా సెల్యూలాయిడ్ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు ఈ చిత్రంతో రెడీ అవుతోంది. వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘బ్యూటీ’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. 'గీతా సుబ్రమణ్యం', 'హలో వరల్డ్', 'భలే ఉన్నాడే' ఫేమ్ వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ  చిత్రాన్ని అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మించారు.  నీలఖి హీరోయిన్ గా  నటించారు. తాజాగా ‘బ్యూటీ’  అనే టైటిల్‌ను ప్రకటించడంతోపాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.  మోషన్ పోస్టర్‌లో చూపించిన బీచ్, రోడ్డు, ఇళ్లు..ఆ తరువాత చివర్లో హీరో హీరోయిన్లను రొమాంటిక్‌గా చూపిస్తూ టైటిల్‌ను చూపించిన తీరు అద్భుతంగా ఉంది. యూత్ ఆడియెన్స్‌కు కిక్కిచ్చేలా ఉంది పోస్టర్. 

నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా  కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా శ్రీ సాయి కుమార్ దారా పని చేస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.  

Updated Date - Feb 14 , 2025 | 10:41 AM