Anjali: 'గేమ్ ఛేంజర్' ఫెయిల్యూర్.. స్పందించిన తొలి వ్యక్తి..
ABN, Publish Date - Jan 28 , 2025 | 08:45 AM
సంక్రాంతి సీజన్ అయిపోయింది. జనవరికు ఎండ్ కార్డ్ పడబోతోంది. ఇప్పుడైనా గేమ్ చేంజర్ రిజల్ట్ గురించి మాట్లాడాలి. ఆ పనే చేసింది అంజలి. గేమ్ చేంజర్‌లో అంజలి ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై తను చాలా ఆశలు పెట్టుకుంది.
‘గేమ్ చేంజర్’ (Game Changer) సినిమా విడుదల కావడం, నెగటివ్ టాక్ తెచ్చుకోవడంపై ఇప్పటి వరకూ టీమ్‌లో ఎవరూ స్పందించలేదు. దిల్ రాజు (Dil Raju) మీడియా ముందుకు వచ్చినా ‘గేమ్ చేంజర్’కు సంబంధించిన ప్రశ్నల్ని నుంచి మెల్లగా జారుకున్నారు. విడుదల తర్వాత ఆ సినిమా ప్రస్తావనే తీసుకురాలేదు. సంక్రాంతి సీజన్ అయిపోయింది. జనవరికు ఎండ్ కార్డ్ పడబోతోంది. ఇప్పుడైనా గేమ్ చేంజర్ (Game Changer Failure) రిజల్ట్ గురించి మాట్లాడాలి. ఆ పనే చేసింది అంజలి (Anjali). గేమ్ చేంజర్‌లో అంజలి ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై తను చాలా ఆశలు పెట్టుకుంది. కానీ సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అదే సమయంలో తమిళంలో విడుదలైన ‘మదగజరాజా’ (Madha Gaja Raja) సూపర్ హిట్టయ్యింది. అలా.. ఈ సంక్రాంతి సీజన్‌ని కవర్ చేసింది. గేమ్ చేంజర్ ఫ్లాప్ ఫలితం మిమ్మల్ని నిరాశ పరిచిందా? అనే ప్రశ్నకు అంజలి తెలివిగా సమాధానం ఇచ్చింది. ‘గేమ్ చేంజర్’ మంచి సినిమా అని, కానీ ఆడలేదని, దానికి చాలా కారణాలున్నాయని, అవన్నీ చెప్పాలంటే సమయం సరిపోదని, ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకోవాలని జవాబిచ్చింది. ఈ సినిమా ఫ్లాప్‌పై తనదైన విశ్లేషణ అంజలి దగ్గర ఉందని తెలుస్తోంది. మరి ఆ రహస్యాన్ని ఎప్పుడు బయట పెడుతుందో చూడాలి.