Anil Ravipudi: ఇండస్ట్రీలోకి రాకముందే అనిల్ ప్రేమకి సహాయం చేసిన నటులు
ABN, Publish Date - Jan 26 , 2025 | 05:01 PM
Anil Ravipudi: బీటెక్ జాయిన్ అయినా తర్వాతైనా ఎవరైనా అమ్మాయిలు మాట్లాడ్తారేమో అని భావిస్తే ఒక్కరు కూడా మాట్లాడలేదట. కానీ అనిల్‌తో అమ్మాయిలు మాట్లాడేందుకు, ప్రేమకు నటులు రఘు బాబు, శ్రీనివాస్ రెడ్డి పరోక్షంగా సహకరించారు. ఎలా అంటే..

దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత ఆయన ఆ రేంజ్ సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగిస్తు టాప్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడు. ఇదంతా పక్కనా పెడితే.. ఆయన సినిమాల్లో భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్‌కు భర్తలు, బాయ్ ఫ్రెండ్స్‌తో ఒక రకమైన రిలేషన్షిప్‌ని కలిగి ఉంటారు. మరి ఇలా ఆయన రాయడానికి తన భార్య ప్రభావం ఏమైనా ఉందా? ఇంతకీ అనిల్ ప్రేమ, పెళ్లి స్టోరీ ఏంటంటే..
అనిల్ రావిపూడి టెన్త్, ఇంటర్‌లో అమ్మాయిలకు చాలా దూరం. కానీ వాళ్ళ అటెన్షన్ మాత్రం కోరుకునే వాడట. ఎట్టకేలకు ఆయన గుంటూరు లోనే విజ్ఞాన్ కాలేజ్ లో బీటెక్ జాయిన్ అయినా తర్వాతైనా ఎవరైనా అమ్మాయిలు మాట్లాడ్తారేమో అని భావిస్తే ఒక్కరు కూడా మాట్లాడలేదట. కానీ అనిల్ తో అమ్మాయిలు మాట్లాడేందుకు, ప్రేమకు నటులు రఘు బాబు, శ్రీనివాస్ రెడ్డి పరోక్షంగా సహకరించారు. అది ఎలా అంటే చిన్నపుడు అనిల్ పెరిగిన ఊర్లో 'చలో తిరుపతి' అనే కామెడీ స్కెచ్ ని రఘు బాబు, శ్రీనివాస్ రెడ్డిలు వచ్చి ప్రదర్శించేవారట. ఇదే స్కిట్ ని రావిపూడి విజ్ఞాన్ కాలేజ్ లో జరిగిన ఓ ప్రోగ్రామ్ లో రీమేక్ చేసి, 'ఆహా నా పెళ్ళంటా' సినిమా ఫ్లేవర్ ని యాడ్ చేశారంట. ఆ స్కిట్ సూపర్ డూపర్ హిట్టైంది. దీంతో చాలామంది అమ్మాయిలు అని కంగ్రాచ్యులేషన్స్ చెప్పడానికి వచ్చారట. అందులో భార్గవి అనే అమ్మాయి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది. భార్గవితో పాటు మరో ఇద్దరు అనిల్ తో కలిసి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత భార్గవితో ప్రేమలో కూడా పడ్డాడు. 12 ఏళ్ల పరిచయం తర్వాత వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ విధంగా అనిల్ రావిపూడి ప్రేమకు రఘు బాబు, శ్రీనివాస్ రెడ్డిలు పరోక్షంగా సహాయం అందించారు.