Allu Aravind: జనాలు థియేటర్స్‌కి వచ్చేలా సినిమాలు తీయాలి...
ABN, Publish Date - Apr 28 , 2025 | 07:29 PM
#సింగిల్ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పలు కారణాలతో థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోందనే మాట ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తోంది.
#సింగిల్ (#Single) సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పలు కారణాలతో థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోందనే మాట ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తోంది. దీనిపై ఇప్పటికే పలు నిర్మాతలు స్పందించగా.. తాజాగా అల్లు అరవింద్ దీనిపై ఆన అభిప్రాయాన్ని తెలిపారు. కరోనా సమయంలో ఓటీటీకి అలవాటు పడిన ఆడియన్స్‌నూ థియేటర్లకు రప్పించేలా సినిమాలు రూపొందించాల్సిన బాధ్యత దర్శక నిర్మాతలపై ఉంది అన్నారు. ఆయన మాట్లాడుతూ ుూకొవిడ్ సమయంలో జనాలు ఓటీటీలకు అలవాటు పడ్డారు. ఆ కారణాంగా వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ.
అయితే మార్పును ఎవరూ ఆపలేరు. ‘సినిమా చాలా బాగుంది’ అనే టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావడంలేదు. చాలా బాగుందని అనిపించేలా సినిమాలు చేయడం దర్శక, నిర్మాతల బాధ్యత. ‘సింగీల్’ చిన్న సినిమానా? మీడియం రేంజ్ సినిమానా? అనేది తెలియదుగానీ తీశాం.. విడుదల చేస్తున్నాం. దీని ఫలితాన్ని బట్టి కూడా మాట్లాడుకోవచ్చు. ట్రైలర్‌లో మూడు రకాల అబ్బాయిల గురించి చెప్పారు. మరి మీరు ఏ కేటగిరీ అని అరవింద్‌ను ప్రశ్నించగా ునేను రౌడీబాయ్‌ని అని సమాధానమిచ్చారు. ప్రేక్షకు?ను కడుపుబ్బా నవ్వించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశాం. కామెడీ ఒక్కటే కాదు మంచి కథ, స్ర్కీన్‌ప్లే కూడా ఉన్నాయి’’ అని బన్నీ వాసు అన్నారు.