Pushpa 2: సంధ్యలో పుష్ప గాడి ర్యాంపేజ్..

ABN, Publish Date - Jan 20 , 2025 | 06:46 AM

Pushpa 2: "ఈ థియేటర్ లో సంక్రాంతి బిగ్గెస్ట్ రిలీజ్ 'గేమ్ ఛేంజర్'ని తొలిగించి 'పుష్ప 2' ప్రదర్శించడం గమనార్హం. రాజకీయంగా, ఇతర పరిస్థితులు పుష్ప రాజ్ ని తగ్గేలా చేశాయి. కానీ.. సినిమాలో మాదిరిగానే పుష్ప ఎక్కడా ఓడాడో, అక్కడే నెగ్గి తన సత్తాని చాటుకున్నాడు."

Pushpa 2 Rampage at Sandhya Theatre

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్' తన ర్యాంపేజ్ ని కొనసాగిస్తున్నాడు. 'పుష్ప 2' ప్రీమియర్స్ లో భాగంగా గతేడాది సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఏర్పడిన సంగతి తెలిసింది. ఈ ఘటనలో ఒక మహిళా మృతి చెందగా బాలుడి పరిస్థితి విషమంగా మారిన పరిస్థితి తెలిసిందే. ఈ ఘటన అల్లు అర్జున్ లైఫ్ పై, పుష్ప 2 సినిమా రన్ పై తీవ్ర ప్రభావం చూపించింది. రాజకీయంగా, ఇతర పరిస్థితులు పుష్ప రాజ్ ని తగ్గేలా చేశాయి. కానీ.. సినిమాలో మాదిరిగానే పుష్ప ఎక్కడా ఓడాడో, అక్కడే నెగ్గి తన సత్తాని చాటుకున్నాడు.


తాజాగా సినిమాకి అదనంగా 20 నిమిషాలను జోడించి.. రీ లోడెడ్ వెర్షన్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీనిని ఆడియెన్స్ ఎలా రీసివ్ చేసుకుంటారని సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం కూడా తెలిసిందే. తక్కువ టికెట్ ధరలకే ఈ సినిమాని ప్రదర్శించడం, సంక్రాంతి సినిమాలు పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో ఆడియెన్స్ మళ్ళీ ఈ సినిమాకే బ్రహ్మరథం పడుతున్నారు. ఈ లేటెస్ట్ వెర్షన్ తో మరింతా క్లారిటీ రావడంతో అభిమానులు సుక్కు మార్క్ కి ఫిదా అవుతున్నారు. ఫస్ట్ వెర్షన్ లో అల్లు అర్జున్ మాస్టర్ క్లాస్ అయితే.. సెకండ్ వెర్షన్ లో సుకుమార్ మాస్టర్ క్లాస్ అంటున్నారు. ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 21 నిమిషాలు కాగా, మరో 20 నిమిషాలు యాడ్ చేశారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కొల్లగొట్టిన నెట్ ఫ్లిక్స్ మరో 10 నిమిషాలు, అంటే దాదాపు 3 గంటల 50 నిమిషాల నిడివితో సినిమాని రిలీజ్ చేయనుంది.


సంధ్య హౌస్ ఫుల్

జనవరి 17న రీ లోడెడ్ వెర్షన్ తో రిలీజ్ అయినా సినిమాకి థియేటర్ లలో మంచి ఆదరణ లభిస్తుంది. తొక్కిసలాట జరిగిన సంధ్య థియేటర్ లోనే ఆదివారం ఈ సినిమాకి థియేటర్ మొత్తం నిండిపోయి కనిపించింది. సినిమా తొలిరోజు వాతావరణాన్ని తలపించింది. ఈ థియేటర్ లో సంక్రాంతి బిగ్గెస్ట్ రిలీజ్ 'గేమ్ ఛేంజర్'ని తొలిగించి 'పుష్ప 2' ప్రదర్శించడం గమనార్హం.


యాడ్ చేసిన సీన్లు ఇవే

ఎర్రచందనం చెన్నై బోర్డర్‌కు తరలించిన తరువాత షెకావత్‌, పుష్పరాజ్‌ మధ్య వచ్చే సన్నివేశంలో అదనంగా మంగళం శ్రీను, దాక్షాయణిలు చెప్పే సంభాషణలు

జాతర సన్నివేశంలో కావేరికి శ్రీవల్లికి మధ్య కొన్ని సంభాషణలు.

ఎర్రచందనం అనుకుని సండ్రను పట్టుకున్న షెకావత్‌ వద్దకు అది ఎర్రచందనం అని తేల్చే కమిటీ రావడం

పుష్పరాజ్‌తో సిండికేట్‌ మీటింగ్‌... ఈ సన్నివేశంలో పుష్పరాజ్‌కు పవర్‌ఫుల్‌ డైలాగులు చేర్చారు.

రామేశ్వరంలో అండర్‌ వాటర్ లో బోట్‌ల కింద ఎర్రచందనం శ్రీలంకకు పంపే సన్నివేశానికి ముందు యాక్సిడెంట్‌లో జపాన్‌ డీలర్‌ హామీద్‌, జక్కారెడ్డి చనిపోయే సన్నివేశం... హామీద్‌ను షెకావత్‌ చంపే సన్నివేశం

అల్లు అర్జున్‌ జపాన్‌ ఎపిసోడ్‌... సినిమాలో ఇంట్రడక్షన్‌ సీన్‌కు ఇది లింకై ఉంటుంది. రీలోడెడ్‌లో ఈ జపాన్‌ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి.

జాలిరెడ్డి ఇంటికెళ్లి పుష్పరాజ్‌... జాలిరెడ్డితో మాట్లాడటం

క్లైమాక్స్‌లో చిన్నప్పుడు పుష్పరాజ్‌ దగ్గర అజయ్‌ లాక్కున చైన్‌ను కావేరి పెళ్లిలో అజయ్‌, పుష్పరాజ్‌ మెడలో వేయడం.

Also Read-Chiranjeevi - Venkatesh: చిరంజీవి తర్వాత వెంకటేష్..

Also Read- Star Heroine: ఈ క్యూట్ గర్ల్.. ఇప్పుడు గ్లామర్ క్వీన్

Also Read-Priyadarshi: టాలీవుడ్ 'నవాజుద్దీన్ సిద్దిఖీ'.. ప్రియదర్శి

మా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 20 , 2025 | 06:49 AM