Allu Arjun: అల్లు అర్జున్ తో ముగ్గురు ముద్దుగుమ్మలు
ABN, Publish Date - Apr 15 , 2025 | 03:34 PM
ఐకాన్ స్టార్ మరోసారి విశ్వరూపం చూపింబోతున్నాడా... అట్లీతో చేయబోతున్న ప్రాజెక్టుతో తన లెవెల్‌ను మరింత హైట్‌కు పెంచుకోబోతున్నాడా.. అంటే అవుననే అనిపిస్తోంది. స్టార్ క్యాస్టింగ్, భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్, కళ్లు చెదిరే CG, VFXతో నెవర్ బిఫోర్ రేంజ్ మూవీ రెడీ అవుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee)తో కలసి ఇప్పటికే మెగా ప్రాజెక్ట్‌ని సెట్ చేశాడు. ఓ వైపు పుష్ప-2(Pushpa 2) కు రూ.1870 కోట్ల గ్రాస్‌తో రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్.. మరోవైపు జవాన్ తో ఆలోవర్ ఇండియాను ఊపేసిన అట్లీ.. వీరి కాంబోలో సన్ పిక్చర్స్ (Sun Pictures) ప్రొడ్యూస్ చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై హైప్ పీక్స్‌లో ఉంది. .ఇప్పటికే అనౌన్స్ మెంట్ వీడియోతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది.అయితే తాజాగా ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.
బన్నీకి జంటగా ఈ సినిమాలో ఎవరిని తీసుకుందామనే విషయంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.మెయిన్ హీరోయిన్‌గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor ) దాదాపు కన్ఫామ్ అని టాక్ వినిపిస్తోంది. ఇంకో ఇద్దరు హీరోయిన్స్‌గా దిశా పటానీ (Disha Patani) , శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) లలో ఒకరిని ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. జాన్వీ మెయిన్ హీరోయిన్ అయితే, మిగిలిన ఇద్దరి రోల్స్ ఎలా ఉంటాయనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఇప్పటికే సమంత (Samantha) ఓ పవర్ ఫుల్ రోల్ లో సమంత నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నుంచి ఓ బిగ్ స్టార్ విలన్‌గా రాబోతున్నాడని చెప్తున్నారు.
మరోవైపు ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని రంగంలోకి దించుతున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. VFX, గ్రాఫిక్స్‌తో ఫుల్ విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. CG, VFX వర్క్‌ల కోసం ఫారిన్ స్టూడియోస్‌తో టై-అప్ అవుతన్నారు. ఇవి టైమ్ తీసుకునే పనులు కాబట్టి పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నారు. ఇక మూవీ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ స్పీడ్‌గా జరిగిపోతోంది. అట్లీ స్పీడ్‌గా, స్టైలిష్ గా సినిమాలు తీసే రకం కావడంతో ఈ స్టైలిష్ స్టార్ మూవీ కోసం ఫ్యాన్స్ ఇప్పటినుంచే కౌంట్‌డౌన్ కూడా స్టార్ట్ చేశారు.