Allu Arjun: బన్నీ మాస్టర్ ప్లాన్.. ఇక ఆపేవాడే లేడు
ABN, Publish Date - Jan 10 , 2025 | 07:35 AM
Allu Arjun: ఒక సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో పెద్ద హిట్టైన తర్వాత.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ని జాగత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో అల్లు అర్జున్ సక్సెస్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బన్నీ అనే పేరు మార్మోగటం ఖాయం.
'పుష్ప 2' హ్యుజ్ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ లైనప్‌పై అందరి కన్ను పడింది. ఒక సినిమా పాన్ ఇండియా లెవెల్ లో పెద్ద హిట్టైన తర్వాత.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ని జాగత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో అల్లు అర్జున్ సక్సెస్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్స్ట్స్ అన్ని అనుకున్నట్లే వర్కౌట్ అయితే ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ స్టార్ గా అల్లు అర్జున్ అవతరించే అవకాశం ఉంది. ఇంతకీ అందరి మైండ్స్ ని బ్లో చేసి బన్నీ ప్లాన్స్ ఏంటంటే..
'పుష్ప 2' తర్వాత బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ ప్రాజెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. అలాగే 'పుష్ప 3' ది ర్యాంపేజ్ కూడా చేస్తున్నారనే విషయం తెలిసిందే. కానీ.. బన్నీ అంతకు మించి మరో బిగ్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీల భన్సాలీతో జత కట్టనున్నట్లు తెలుస్తోంది. తన మార్క్ గ్రాండ్ స్కేల్‌లో సంజయ్ లీల గొప్ప సినిమాలను చిత్రీకరించాడు. గొప్ప కథనాలతో భారతదేశం గర్వించదగ్గ గొప్ప డైరెక్టర్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన తీసిన సినిమాలన్నీ క్లాసికే. సిల్వర్ స్క్రీన్ అనే కాన్వాస్ పై ఆయన చిత్రాలన్నీ గొప్ప కావ్యాలే. ఇలాంటి సంజయ్ భన్సాలీతో అల్లు అర్జున్ సినిమా అంటే ఇండస్ట్రీలు భయపడతాయి. ఇది ఎంత వరకు దారి తీస్తుందో అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన మొదటి పాన్ ఇండియా చిత్రాన్ని బన్నీతో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ లో పట్టాలెక్కనుంది. ప్రస్తుతం గురూజీ స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నారు. ఈ సినిమాతో త్రివిక్రమ్ కొత్త లోకాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో హిస్టారికల్ ఎలిమెంట్స్‌ని మైథలాజికల్ టచ్‌తో చూపించేందుకు ఆయన రెడీ అవుతున్నారు. మరోవైపు హిస్టారికల్ వారియర్ 'చెంఘీజ్ ఖాన్' జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇది కాకుండా బన్నీ.. సందీప్ రెడ్డి వంగాతో మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ లెక్క ప్రకారం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బన్నీ అనే పేరు మార్మోగటం ఖాయం.