Rajitha: నటి రజితకు మాతృవియోగం..

ABN, Publish Date - Mar 21 , 2025 | 04:40 PM

ప్రముఖ నటి రజిత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రజిత మాతృ మూర్తి  విజయలక్ష్మీ (76)గుండెపోటుతో మరణించారు

ప్రముఖ నటి రజిత (Rajitha) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం రజిత మాతృ మూర్తి  విజయలక్ష్మీ (Vijayalakshmi -76)గుండెపోటుతో మరణించారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు  కృష్ణవేణి, రాగిణిలు విజయలక్ష్మీకి చెల్లెళ్లు అవుతారు. విజయలక్ష్మీ మృతికి టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలియచేశారు. రజిత ధైర్యంగా ఉండాలని సోషల్ఆ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.  

Updated Date - Mar 21 , 2025 | 04:48 PM